Puri Mumbai to Hyd: నెలకు రూ. 10 లక్షల అద్దె భారం.. పైగా 'లైగర్' ఎఫెక్ట్.. ముంబై నుంచి షిఫ్ట్ అవుతున్న పూరీ జగన్నాథ్..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో ఎన్నో అంచనాల మధ్య విడుదలైన 'లైగర్' సినిమా డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఈ సినిమాతో పూరీ జగన్నాథ్ కు భారీ నష్టాలు వచ్చాయి. దీంతో, ముంబైలో తీసుకున్న భవనానికి అద్దె కట్టడాన్ని భారంగా భావించిన ఆయన... తన మకాంను అక్కడి నుంచి హైదరాబాద్ కు మార్చే పనిలో ఉన్నారని చెపుతున్నారు.

Hyderabad, September 9: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో  ఎన్నో అంచనాల మధ్య విడుదలైన 'లైగర్' సినిమా డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఈ సినిమా ఫెయిల్యూర్ విజయ్ దేవరకొండ స్పీడ్ కు బ్రేక్ వేయగా... దర్శకుడు పూరీ జగన్నాథ్ కు పీడకలను మిగిల్చింది. ఈ సినిమా కోసం పూరీ తన మకాంను ముంబైకి మార్చేశారు. నెలకు రూ. 10 లక్షల అద్దెకు అక్కడ ఓ పెద్ద మ్యాన్షన్ ని అద్దెకి తీసుకున్నాడు. ఈ సినిమాను మూడేళ్ల పాటు నిర్మించారు. ప్రమోషన్స్ సమయంలో కూడా ఈ సినిమాకు పెద్ద హైప్ క్రియేట్ అయింది. కానీ తీరా విడుదలయ్యాక అంచనాలను అందుకోలేక చతికిల పడింది.

డిజిటల్ ఎంట్రీకి రెడీ.. మహిళా ప్రాధాన్యం ఉన్న వెబ్ సిరీస్ కు ఇలియానా గ్రీన్ సిగ్నల్

ఈ సినిమాతో పూరీ జగన్నాథ్ కు భారీ నష్టాలు వచ్చాయి. దీంతో, ముంబైలో ఆ భవనానికి అద్దె కట్టడాన్ని భారంగా భావించిన ఆయన... తన మకాంను అక్కడి నుంచి హైదరాబాద్ కు మార్చే పనిలో ఉన్నారని చెపుతున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండతోనే 'జనగణ మన' తీయాలని పూరీ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయినట్టు ప్రచారం జరుగుతోంది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement