Naga Chaitanya: కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై నాగ‌చైత‌న్య ఘాటు కౌంట‌ర్, ఇంత‌కీ నాగ‌చైత‌న్య ఏమ‌న్నారంటే?

మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్య‌ల దుమారం కొన‌సాగుతోంది. దీనిపై ఇప్ప‌టికే బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున రియాక్ష‌న్స్ వ‌స్తున్నాయి. తాజాగా కింగ్ నాగార్జున‌, న‌టి స‌మంత (Samantha) కూడా సురేఖ వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. అయితే నాగ చైతన్య (Naga Chaithanya) ఎలా రియాక్ట్ అవుతార‌ని అంతా ఎదురుచూశారు. కా

Naga Chaitanya-Samantha Divorce

Hyderabad, OCT 02: మంత్రి కొండా సురేఖ (Konda Surekha) చేసిన వ్యాఖ్య‌ల దుమారం కొన‌సాగుతోంది. దీనిపై ఇప్ప‌టికే బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున రియాక్ష‌న్స్ వ‌స్తున్నాయి. తాజాగా కింగ్ నాగార్జున‌, న‌టి స‌మంత (Samantha) కూడా సురేఖ వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. అయితే నాగ చైతన్య (Naga Chaitanya) ఎలా రియాక్ట్ అవుతార‌ని అంతా ఎదురుచూశారు. కానీ ఆయ‌న కూడా త‌న తండ్రి బాట‌లోనే సున్నితంగా స్పందించారు. అక్కినేని నాగార్జున చేసిన ట్వీట్ ను నాగ‌చైత‌న్య రీ ట్వీట్ చేశారు. నాగ చైత‌న్య ఇటీవలే శోభిత ధూళిపాళ్ల‌తో నిశ్చితార్ధం చేసుకున్నారు. త్వ‌ర‌లోనే వాళ్లిద్ద‌రూ పెళ్లిపీట‌లు ఎక్క‌నున్నారు. ఇంతలోనే సురేఖ వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టించాయి.

Here's the Naga Chaitanya Reaction

 

కేటీఆర్‌ తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారని కొండా సురేఖ అన్నారు. కొందరు హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకుని సినిమా ఫీల్డ్‌ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్‌ అని ఆరోపించారు. ఆయన మత్తు పదార్థాలకు అలవాటు పడి, సినిమా వాళ్లకు కూడా వాటిని అలవాటు చేశారని విమర్శించారు. రేవ్‌ పార్టీలు చేయడంతో పాటు, సినీతారలను ఇబ్బంది పెట్టిన వ్యక్తి కేటీఆర్‌ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇది సినిమా పరిశ్రమలో ఉన్న వారందరికీ తెలుసని అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్‌ అవుతున్నాయి.

Samantha Reacts on Surekha Comments: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన స‌మంత‌, ఇన్ స్టాగ్రామ్ లో భావోద్వేగ నోట్, కేటీఆర్ తో ప‌రిచయంపై ఏమ‌న్నారంటే? 

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌తో రాజ‌కీయ రంగంతో పాటూ సినీ రంగం షేక్ అవుతోంది. ఏ ఇద్ద‌రిని క‌దిపినా అదే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్ప‌టికే కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌పై నాగార్జున స్పందించారు. తాజాగా స‌మంత కూడా ఈ కామెంట్స్ పై సోష‌ల్ మీడియా వేదిక‌గా రియాక్ట్ అయ్యారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఆమె అభ్యంత‌రం తెలిపారు. ఇన్ స్టా వేదిక‌గా స‌మంత చేసిన ప్ర‌క‌ట‌న ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ఇప్ప‌టికే పలు మార్లు ఆమె విడాకుల అంశంపై స్పందించారు. స‌రిగ్గా మూడేళ్ల క్రితం నాగ చైత‌న్య‌, స‌మంత ఇదే రోజున విడాకులు ప్ర‌క‌టించారు. అయితే మ‌ళ్లీ మంత్రి సురేఖ్య వ్యాఖ్య‌ల‌తో ఈ అంశం తెర‌పైకి వ‌చ్చింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement