National Film Awards 2019: జాతీయ సినిమా అవార్డులు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. మన 'మహానటి' కి 'కీర్తి' కిరీటం. పూర్తి విజేతల జాబితా ఇక్కడ చూడండి.

టాలీవుడ్ నుంచి మహానటి, చి॥ల॥సౌ॥, రంగస్థలం మరియు అ! చిత్రాలకు అవార్డులు దక్కాయి. 'మహానటి'లో నటనకు గానూ కీర్తి సురేష్ 'జాతీయ ఉత్తమ నటి' అవార్డును సొంతం చేసుకుంది...

National Film Awards 2019 winners list. (Photo Credits: Twitter)

ప్రతిష్టాత్మక జాతీయ సినిమా అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆగష్టు 9, శుక్రవారం రోజున ఢిల్లీలో జరిగిన 66వ జాతీయ సినిమా అవార్డులు-2019 కార్యక్రమంలో వివిధ కేటగిరీల్లో విజేతలను ప్రకటించారు. కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గతేడాది దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలయిన సినిమాలను పరిగణలోకి తీసుకొని వివిధ కేటగిరీలలో ఉత్తమమైన వాటిని జ్యూరీ ఎంపికచేసింది. ఇందులో భాగంగా ఫిల్మ్ ఫ్రెండ్లీ రాష్ట్రంగా 'ఉత్తరాఖండ్' స్పెషల్ అవార్డును దక్కించుకుంది.

టాలీవుడ్ నుంచి మహానటి, చి॥ల॥సౌ॥, రంగస్థలం మరియు అ! చిత్రాలకు అవార్డులు దక్కాయి. 'మహానటి'లో నటనకు గానూ కీర్తి సురేష్ ఏకంగా 'జాతీయ ఉత్తమ నటి' అవార్డును సొంతం చేసుకుంది.

విజేతల పూర్తి జాబితా:

మోస్ట్ ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్: ఉత్తరాఖండ్

ఉత్తమ నటుడు: ఆయుష్మాన్ ఖురానా (Andhadhun), విక్కీ కౌషల్ (URI)

ఉత్తమ నటి: కీర్తి సురేష్ (Mahanati)

ఉత్తమ హిందీ చిత్రం: అంధాధున్ (శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం)

ఉత్తమ సహాయ నటి: సురేఖా సిక్రీ (బధాయ్ హో)

ఉత్తమ సహాయ నటుడు: స్వానంద్ కిర్కిరే (చుంబాక్)

ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధార్ (URI)

ఉత్తమ చిత్రం: హెలారో (గుజరాతీ)

ఉత్తమ యాక్షన్: KGF చాప్టర్ 1

ఉత్తమ స్క్రీన్ ప్లే: అంధాధున్

ఉత్తమ కొరియోగ్రఫీ: పద్మావత్ (Ghoomar Song)

ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్: Son Rise మరియు The Secret Life of Frogs

ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు:

రాజస్థానీ - Turtle

పంచెంగా - In the Land of Poisonous Women

మరాఠీ - భోంగా

ఉర్దూ - హమీద్

తెలుగు - మహానటి

అస్సామీ - Bulbul Can Sing

పంజాబీ - అర్జేధ

ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: తెలుగు చిత్రం అ! మరియు కన్నడ చిత్రం కెజిఎఫ్.

ఉత్తమ సాహిత్యం: నాతిచరామి

ఉత్తమ సంగీత దర్శకుడు: సంజయ్ లీలా భన్సాలీ (పద్మావత్)

ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్: అ! (తెలుగు)

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: మహానటి (తెలుగు)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కమార సంభవం (మలయాళం)

ఉత్తమ సౌండ్ డిజైనర్: Uri

ఉత్తమ ఎడిటింగ్: నాతిచరామి (కన్నడ)

ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: చి॥ల॥సౌ॥

ఉత్తమ డైలాగ్స్: తారిఖ్ (బెంగాలీ)

ఉత్తమ ఫిమేల్ ప్లేబ్యాక్ సింగర్: బింధుమలినిఫ్ (నాతిచరామిలోని మాయావి మానవే పాటకు)

ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్: అర్జీత్ సింగ్ (పద్మావత్ లోని Binte Dil పాటకు)

ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: పి.వి.రోహిత్, సాహిబ్ సింగ్, తల్హా అర్షద్ రేషి మరియు శ్రీనివాస్ పోకాలే

పర్యావరణ సంభాషణపై ఉత్తమ చిత్రం: పానీ (మరాఠీ)

సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రం: Padman

పూర్తి వినోదభరితమైన, ప్రజాదరణ పొందిన ఉత్తమ చిత్రం: బధాయ్ హో

నర్గీస్ దత్ అవార్డు: ఒందల్ల ఎరడల్ల (కన్నడ)

ఉత్తమ డెబ్యూ డైరెక్టర్: సుధాకర్ రెడ్డి యక్కంతి, నాల్‌.

SIIMA Awards 2019: సౌత్ ఇండియన్ మెగా సినిమా ఉత్సవం 2019 నామినేషన్స్ లిస్ట్. బెస్ట్ సినిమా, బెస్ట్ యాక్టర్‌గా మీరైతే ఎవరిని ఎన్నుకుంటారు?



సంబంధిత వార్తలు