Radhe Shyam Postponed:ప్రభాస్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్, సంక్రాంతి బరి నుంచి రాధేశ్యామ్ ఔట్, ఒమిక్రాన్ భయంతో వాయిదా వేస్తున్నట్లు ప్రకటన, కొత్త తేదీలు వెల్లడించని టీమ్

ఊహించినట్లే జరిగింది. కరోనా మహమ్మారి దెబ్బకు మరో పాన్ ఇండియా(Pan India Movie) మూవీ రిలీజ్ వాయిదా పడింది. సంక్రాంతి (Sankranthi)కానుకగా జనవరి 14న దేశవ్యాప్తంగా విడుదల చేయాలనుకున్న రాధేశ్యామ్(Radhe Shyam) మూవీ రిలీజ్ వాయిదా(Radhe Shyam Postponed) పడింది.

Prabhas 20 First Look (Photo Credits: Instagram)

Hyderabad January 05: ఊహించినట్లే జరిగింది. కరోనా మహమ్మారి దెబ్బకు మరో పాన్ ఇండియా(Pan India Movie) మూవీ రిలీజ్ వాయిదా పడింది. సంక్రాంతి (Sankranthi)కానుకగా జనవరి 14న దేశవ్యాప్తంగా విడుదల చేయాలనుకున్న రాధేశ్యామ్(Radhe Shyam) మూవీ రిలీజ్ వాయిదా(Radhe Shyam Postponed) పడింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మూవీ రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది యూవీ క్రియేషన్స్(UV Creations). దేశంలో ఒమిక్రాన్‌ కేసులు పెరగడం కారణంగా సినిమా విడుదలను వాయిదా వేయడం తప్పలేదని చిత్ర యూనిట్‌ పేర్కొంది. హ‌ద్దులులేని ప్రేమ‌ను, మ‌ద్ద‌తును ఇస్తున్న అభిమానుల‌కు థ్యాంక్స్ చెబుతున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఇప్పటికే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న‌ ట్రిపుల్ ఆర్(RRR Movie) మూవీ రిలీజ్‌ను ఇటీవ‌ల వాయిదా వేశారు. ప్రభాస్ పామాల‌జిస్ట్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే(Pooja Hegde) హీరోయిన్ పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ కూడా చేసింది టీమ్. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను నిర్వహించింది. మూవీ వాయిదా గురించి ట్వీట్ చేసిన యూవీ క్రియేషన్స్. త్వ‌ర‌లోనే సినిమా థియేట‌ర్ల‌లో రాధేశ్యామ్‌(Radhe Shyam)ను క‌లుసుకోవ‌చ్చు అని త‌న ట్వీట్‌లో తెలిపింది. రాధేశ్యామ్‌ రిలీజ్‌కు సంబంధించిన కొత్త తేదీల‌ను నిర్మాత‌లు ఇంకా ప్ర‌క‌టించ‌లేదు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement