Poonam Kaur on Trivikram: జానీ మాస్టర్ తరువాత దర్శకుడు త్రివిక్రమ్ వంతు, తనను అనేక ఇబ్బందులకు గురి చేశారంటూ పూనమ్ కౌర్ ట్వీట్, ఫిలిం ఛాంబర్ రియాక్షన్ ఏంటంటే..

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన తరుణంలో త్రివిక్రమ్ ను ఉద్దేశించి సినీ నటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ చేశారు. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో ఆయనను మాస్టర్ అని పిలవొద్దని పూనమ్ ట్వీట్ చేసింది.

Trivikram Srinivas vs Poonam Kaur (Photo-FB)

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన తరుణంలో త్రివిక్రమ్ ను ఉద్దేశించి సినీ నటి పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ చేశారు. జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో ఆయనను మాస్టర్ అని పిలవొద్దని పూనమ్ ట్వీట్ చేసింది. ఇదే సమయంలో త్రివిక్రమ్ గురించి స్పందిస్తూ... ఆయనపై తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో గతంలో ఫిర్యాదు చేశానని... అయితే, సినీ పెద్దలు తన ఫిర్యాదులు పట్టించుకోలేదని విమర్శించింది. తనను రాజకీయంగా అనేక ఇబ్బందులకు గురి చేశారని చెప్పింది. ఇప్పటికైనా సినీ పెద్దలు త్రివిక్రమ్ ను ప్రశ్నించాలని వ్యాఖ్యానించింది. వీడియో ఇదిగో, సెక్స్‌ కోరిక తీర్చాలంటూ జానీ మాస్టర్ నన్ను దారుణంగా..మాట వినకపోతే ఆఫర్లు రావంటూ..

పూనమ్ కౌర్ వ్యాఖ్యలపై 'మా' ఇంకా స్పందించకపోయినా... ఫిలిం ఛాంబర్ మాత్రం స్పందించింది. లైంగిక దాడుల కేసుల పరిష్కారానికి సంబంధించి ఫిలిం ఛాంబర్ ఏర్పాటు చేసిన ప్యానెల్ లో సభ్యుడిగా ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ... పూనమ్ కౌర్ ఎప్పుడు ఫిర్యాదు చేసిందో? ఎందుకు ఫిర్యాదు చేసిందో? ఫిలిం ఛాంబర్ కు తెలియదని అన్నారు. ఫిర్యాదు లేకుండా తాము ముందుకు వెళ్లలేమని స్పష్టం చేశారు. తనకు అన్యాయం జరిగినట్టు పూనమ్ భావిస్తే... ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు ఇవ్వాలని తమ్మారెడ్డి సూచించారు.

Here's Tweet

పూనమ్ ఫిర్యాదును 'మా' తమకు ఫార్వర్డ్ చేసినా... తాము ఆ అంశంపై విచారిస్తామని తెలిపారు. ఫిలిం ఛాంబర్ లో ఓ బాక్స్ ఉంటుందని... ఆ డబ్బాలో ఫిర్యాదు వేసి వెళ్లిపోవచ్చని చెప్పారు. లేదా వాట్సాప్, ఈమెయిల్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చని చెప్పారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు, సినీ నటి పూనమ్ కౌర్ కు మధ్య ఎప్పటి నుంచో వివాదం ఉన్న సంగతి విదితమే.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..

Andhra Pradesh: పేర్ని నాని అరెస్ట్ త్వరలో, కూటమి శ్రేణుల్లో ఆనందాన్ని చూడాలంటూ మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు

L&T Chairman SN Subrahmanyan: ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల కార్మికులు దొరకడం లేదు, మళీ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కిన ఎల్‌ అండ్‌ టీ చైర్మన్‌ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్

Mahindra BE 6: ఎలక్ట్రిక్ SUV విభాగంలో సవాల్ విసరబోతున్న మహీంద్రా బీఈ6, సూపర్‌ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో బెస్ట్ ఫీచర్లు, వేరియంట్లు ఇవిగో..

Advertisement
Advertisement
Share Now
Advertisement