Krishnam Raju Death: స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమకి నా జోహార్లు... సిగ్గు! సిగ్గు!.. ఇదేనా మీరిచ్చే వీడ్కోలు.. కృష్ణంరాజు మృతి నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు.. రెండు రోజులు షూటింగ్ ఆపుదామని వ్యాఖ్య

ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు మృతి నేపథ్యంలో వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన చావుకు విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజు గారి లాంటి పెద్ద మనిషికి విలువ ఇద్దామని, కనీసం రెండు రోజులు షూటింగ్ లు ఆపుదామని ఆయన అన్నారు.

Varma

Hyderabad, September 12: ఎప్పుడూ వివాదాల‌తో వార్త‌ల్లో ఉండే ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ (Ram Gopal Varma). ఆయ‌న మ‌రోసారి త‌న్ ట్విట్ట‌ర్ ద్వారా సినీ పెద్ద‌ల‌ను టార్గెట్ చేశారు. ప్రముఖ సినీ నటుడు కృష్ణంరాజు మృతి నేపథ్యంలో వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన చావుకు విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజు గారి లాంటి పెద్ద మనిషికి విలువ ఇద్దామని, కనీసం రెండు రోజులు షూటింగ్ లు ఆపుదామని ఆయన అన్నారు.  'మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజుగారి లాంటి పెద్ద మనిషికి విలువ ఇద్దాం.

ఓటమితో మొదలై కేంద్రమంత్రి వరకు ఎదిగిన రెబల్‌ స్టార్, ఇంట్రెస్టింగ్‌గా సాగిన కృష్ణంరాజు పొలిటికల్ జర్నీ, నరసాపురం నుంచి రాజకీయ ప్రస్థానం, కేంద్రంలో కీలక శాఖలు నిర్వహించిన దిట్ట

కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెల రోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది. నేను కృష్ణ గారికి, మురళీ మోహన్ గారికి, చిరంజీవి గారికి, మోహన్ బాబు గారికి, పవన్ కల్యాణ్ కు, మహేశ్ బాబుకు, బాలయ్యకు, ప్రభాస్ కు ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే... రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది' అని ట్వీట్ చేశారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాజమౌళికి కూడా ఈ ట్వీట్ ను ట్యాగ్ చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు

Uttarandhra Teacher MLC Election: కూటమికి భారీ షాక్, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో గాదె శ్రీనివాసులు నాయుడు విజయం, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మకు ఓటమి

SC Dismisses Jagan's Bail Cancellation Petition: జగన్‌ బెయిల్‌ రద్దుకు కారణాలేవీ లేవు, రఘురామ పిటిషన్ డిస్మిస్‌ చేస్తున్నట్లు ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు, ఈ కేసును కేసును తెలంగాణ హైకోర్టు విచారిస్తోందని వెల్లడి

Tilak Varma Take A Bow: ఒంటిచేత్తో భారత్‌ను గెలిపించిన తిలక్ వర్మ.. వంగి మరీ సలాం కొట్టిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, మాజీ ఆటగాళ్ల ప్రశంసలు

Advertisement
Advertisement
Share Now
Advertisement