Hyd, Jan 26: చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా(Team India) అద్భుత విజయాన్ని సాధించింది. ముఖ్యంగా వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడు తిలక్ వర్మ(Tilak Varma Take A Bow). ఓ వైపు టాప్ ఆర్డర్ కుప్పకూలిన అనుభవం కలిగిన ఆటగాడిలా ఒక్కడే జట్టును విజయతీరాలకు చేర్చాడు తిలక్. దీంతో ఇంగ్లండ్ విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలిఉండగానే 8 వికెట్లు కొల్పోయి చేధించింది భారత్.
తిలక్ వర్మ 55 బంతుల్లో 5 సిక్సర్లు, 4 ఫోర్లతో 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) వంగి మరి సలాం కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విండీస్‌పై హ్యాట్రిక్ వికెట్లు తీసిన నొమన్ అలీ.. టెస్టుల్లో హాట్రిక్ సాధించిన పాకిస్థాన్ ఐదో బౌలర్‌గా గుర్తింపు, వీడియో ఇదిగో
ఇక తిలక్ వర్మ ఆటతీరుకు ఫిదా అయ్యారు మాజీ ఆటగాళ్లు. అద్భుత ఆటతీరుతో ఇంప్రెస్ చేశావని ప్రశంసలు గుప్పిస్తున్నారు. మాజీ ఆటగాళ్లు అభినవ్ ముఖుంద్, పార్థివ్ పటేల్ సోషల్ మీడియా వేదికగా తిలక్ ఆటతీరు అద్భుతమని కొనియాడారు. ఇది అసాధారణమైన ప్రదర్శన.. బెస్ట్ ఇన్నింగ్సే కాదు బాధ్యతతో జట్టును గెలిపించాడన్నారు అభినవ్.
తిలక్ వర్మ(Tilak Varma) టీ20 బ్యాటర్‌గా తన స్థాయిని పెంచుకుంటున్నాడు అన్నారు పార్ధివ్ పటేల్. ఈ తరం ఆటగాళ్లు ఒంటరిగా మ్యాచ్‌లను గెలింపించగలరు అనే నమ్మకాన్ని నిలబెట్టాడన్నారు పార్ధివ్.
Take A Bow, Suryakumar Yadav salute Tilak Varma for his mature innings
Take A Bow, Tilak Varma 👏
Scoreboard ▶️ https://t.co/6RwYIFWg7i#TeamIndia | #INDvENG | @idfcfirstbank | @TilakV9 | @surya_14kumar pic.twitter.com/wriIceydhx
— BCCI (@BCCI) January 25, 2025
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది జోస్ బట్లర్ 45 పరుగులు, బ్రైడెన్ కార్సే 30 పరుగులతో రాణించాడు. 28న మూడో టీ20 జరగనుంది.