Actress Sri Reddy: చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, అనితలపై చేసిన వ్యాఖ్యల కేసులో నటి శ్రీరెడ్డికి హైకోర్టులో కాస్త ఊరట.. షరతులతో కూడిన బెయిలు మంజూరు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, అనిత, వారి కుటుంబ సభ్యులను సోషల్ మీడియా వేదికగా దూషించిన కేసులో నటి శ్రీరెడ్డికి ఎట్టకేలకు హైకోర్టులో ఊరట లభించింది.

Actress Sri Reddy (Credits: X)

Vijayawada, Feb 25: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu naidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మంత్రులు నారా లోకేశ్, అనిత, వారి కుటుంబ సభ్యులను సోషల్ మీడియా వేదికగా దూషించిన కేసులో నటి శ్రీరెడ్డికి (Actress Sri Reddy) ఎట్టకేలకు హైకోర్టులో ఊరట లభించింది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన ఆమెపై రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిలు కోరుతూ శ్రీరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో నమోదైన కేసులో హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేసింది. వారానికోసారి దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని శ్రీరెడ్డిని కోర్టు ఆదేశించింది.

అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. భక్తులపై దాడి చేసిన ఏనుగుల గుంపు.. ముగ్గురు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం

ఆ కేసులో ఊరట లేదు

చిత్తూరు పోలీసులు పెట్టిన కేసులో ముందస్తు బెయిలు పిటిషన్‌ కు విచారణ అర్హత లేదంటూ పిటిషన్‌ ను కోర్టు కొట్టివేసింది. కర్నూలు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లోని కేసులకు సంబంధించి శ్రీరెడ్డికి నోటీసులు ఇచ్చి, వివరణ తీసుకోవాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు.

బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 5.1గా నమోదు.. కోల్‌ కతా, భువనేశ్వర్‌ ను తాకిన ప్రకంపనలు

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్‌ వేసిన విజయశాంతి, హిట్‌ మూవీ వైజయంతి రోల్‌లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!

Telangana Assembly Sessions: 12 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. 18న లేదా 19న రాష్ట్ర బడ్జెట్, ఈసారైనా అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వచ్చేనా!

Advertisement
Advertisement
Share Now
Advertisement