Elephant Attack in AP (Credits: X)

Vijayawada, Feb 25: ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లోని అన్నమయ్య జిల్లాలో ఏనుగుల గుంపు (Elephant Attack) బీభత్సం సృష్టించింది. ఓబులవారిపల్లె మండలం గుండాలకోన వద్ద భక్తులపై ఏనుగులు దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉంది. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వై. కోటకు చెందిన కొందరు భక్తులు ఆలయానికి వెళ్తుండగా వారిపై ఏనుగుల గుంపు దాడికి పాల్పడినట్టు ప్రత్యేక్ష సాక్షులు తెలిపారు.

ఇంకా కానరాని 8 మంది జాడ, కొనసాగుతున్న ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్, రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

బాధితులు వీళ్లే..

ఏనుగుల గుంపు దాడి బాధితులంతా రైల్వే కోడూరు మండలం ఉర్లగడ్డపోడుకు చెందిన భక్తులుగా గుర్తించారు. గాయపడినవారిని స్థానికులు దవాఖానకు తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

దారుణం, బిస్కెట్ కోసం వెళ్ళిన మైనర్ బాలిక నోట్లో గుడ్డలు కుక్కి గ్యాంగ్ రేప్, ముగ్గురి కామాంధుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు

మొన్న కూడా..

నెలరోజుల కిందట కూడా తిరుపతి జిల్లాలో కూడా ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంట పొలాలపై అర్ధరాత్రి ఏనుగుల గుంపు దాడికి పాల్పడింది. చంద్రగిరి మండలం మామిడి మానుగడ్డలో ఈ ఘోరం జరిగింది. ఏనుగుల గుంపును తరిమేందుకు వెళ్లిన రైతులపై ఏనుగులు విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలో ఉపసర్పంచ్‌ రాకేశ్ ను ఏనుగులు తొక్కిచంపాయి.