SLBC Tunnel Collapse Update

Hyd, Feb 24: నాగర్‌కర్నూల్‌లోని శ్రీశైలం ఎడమ గట్టు కాలవ సొరంగం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సుమారు 13 కిలోమీటర్ల లోపలున్న పైకప్పు కూలడంతో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. లోకోట్రైన్ రాకపోకలకు 9వ కిలోమీటర్‌ వద్ద అంతరాయం కలిగింది. మరమ్మతులు చేసి సమస్యను పరిష్కించేందుకు సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు.

టన్నెల్‌లో 11వ కి.మీ నుంచి 2 కి.మీ మేర భారీగా నీరు నిలిచిపోయింది. టన్నెల్‌లో (SLBC Tunnel Collapse Update) రెండు పంపింగ్‌ స్టేషన్ల మధ్య భారీ నీరు నిలిచిపోవడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది. ప్రత్యేకంగా పంపులు తెప్పించి డీవాటరింగ్‌ చేస్తున్నారు. అర్ధరాత్రి టీబీఎంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు వంద మీటర్ల బురదను దాటి లోపలికి వెళ్లాయి. సహాయ చర్యలపై అధికారులు సమీక్షిస్తూనే ఉన్నారు.

ఘటన జరిగి ఇప్పటికే 48 గంటల కావస్తుండటంటో సొరంగంలోపల చిక్కుకుపోయిన వారిని చేరుకునేందుకు ఆర్మీ, జాతీయ విపత్తు నిర్వహణ బృందం, నేవీ కమాండోలు, రాష్ట్ర అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, 2023లో ఉత్తరాఖండ్ టెన్నెల్ కూలిన సందర్భంలో బాధితులను కాపాడిన బృందం సభ్యులు తాజాగా రంగంలోకి దిగారు. అప్పటి రెస్క్యూ ఆపరేషన్‌ బృందంలోని ఆరుగురు సభ్యులు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు.

ఆపరేషన్ ఎస్ఎల్బీసీ... రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆరుగురు ర్యాట్ హోల్ మైనర్స్.. 2023లో ఉత్తరాఖండ్‌ లో 41 మందిని కాపాడింది ఈ టెక్నిక్ ద్వారానే..!

రక్షణ చర్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నాయి. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసిన సొరంగం లోపలి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల గురించి కూడా వాకబు చేశారు. మరోవైపు, సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Ex NDMA Vice chairman Marri Shashidhar Reddy on SLBC tunnel collapse

Southern Command INDIAN ARMY stands steadfast with all

SLBC Tunnel Collapse Update:

సొరంగంలో చిక్కుకుపోయన వారిలో (SLBC Tunnel Collapse in Nagarkurnool) నలుగురు కార్మికులు కాగా మిగతా వారు కస్ట్రక్షన్ సంస్థ సిబ్బంది. ప్రస్తుతం రెస్క్యూ బృందాలు పైకప్పు కూలిన భాగానికి 100 మీటర్ల దూరంలో ఉన్నాయి. గత రాత్రంతా తాను సొరంగంలోని సహాయక చర్యల గురించి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సహాయక చర్యలకు అడ్డంకిగా మారిన నీటిని బయటకు తోడేసేందుకు, లోపలున్న వారికి ఆక్సీజన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా, లోపలున్న వారిని చేరుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై కూడా దృష్టి పెట్టినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.

సొరంగంలో 13.8 కి.మీ ప్రయాణించిన మంత్రి జూపల్లి కృష్ణారావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. 6.8 కి.మీ లోకో ట్రైన్ లో ప్రయాణించి అక్కడి నుంచి కన్వేయర్ బెల్ట్ పై 7 కి.మీ కాలినడక వెళ్లారు. రెస్క్యూ టీంకు అండగా నిలబడి భరోసా కల్పించారు మంత్రి. ఇక మాజీ NDMA వైస్ చైర్మన్ మరియు బిజెపి నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడుతూ, "...ఇటువంటి ప్రమాదం సంభవించడం ఇదే మొదటిసారి కాకపోవడం నిజంగా నిరాశపరిచింది. ఇది విచారకరం, SLBC సొరంగం కూలిపోయింది. ఇది ఖచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకోవలసిన సమయం. ఇలాంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టలేదని నేను భావిస్తున్నాను. ఇలాంటి రెండు సంఘటనలు జరిగాయి. పాఠం ఏమిటి? భద్రతా చర్యలు ఎందుకు తీసుకోలేదు? ...చిక్కుకుపోయిన ప్రజలను రక్షించగలమని ప్రార్థిద్దాం. వారు క్షేమంగా తిరిగివస్తారని ఆశిద్దాం. రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ కూర్చుని అటువంటి పరిస్థితులకు నిర్వహణ ప్రణాళిక, విపత్తు నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేయాలని తెలిపారు.