P Susheela Unwell: ప్రముఖ గాయని పీ సుశీలకు అస్వస్థత.. కడుపు నొప్పితో హాస్పిటల్ లో చేరిక.. ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం
ప్రముఖ నేపథ్య గాయని, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పీ సుశీల శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెను చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేర్పించారు.
Hyderabad, Aug 18: ప్రముఖ నేపథ్య గాయని పీ సుశీల (P Susheela Unwell) శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెను చెన్నైలోని (Chennai) కావేరి ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. సుశీల ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హాస్పిటల్ వైద్యులు తెలిపారు.
కోలుకోవాలని ప్రార్థనలు
సుశీల పలు భాషల్లో లెక్కలేనన్ని పాటలు పాడారు. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సంగీత ప్రపంచంలో ఆమె చేసిన సేవలకు పద్మభూషణ్ తో భారత ప్రభుత్వం గౌరవించింది. కాగా ఆమె వీలైనంత త్వరగా కోలుకోవాలని, హాస్పిటల్ నుంచి డిచార్జ్ అవ్వాలని సినీ ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులు కోరుకుంటున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Norovirus Outbreak: నోరో వైరస్ కలకలం.. క్రూయిజ్లో వందల మంది ప్రయాణీకులకు నోరోవైరస్, వాంతులతో భయానక వాతావరణం, వివరాలివే
Hyderabad: హెల్మెట్ ధరించకుండా రోడ్డు మీదకు బైకుతో వెళితే జేబులు గుల్లే, నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు
AP Capital Amaravathi Update: అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు, ఎంత ఖర్చవుతుంది? ఎప్పటి నుంచి పనులు ప్రారంభిస్తారంటే?
P Susheela Unwell: ప్రముఖ గాయని పీ సుశీలకు అస్వస్థత.. కడుపు నొప్పితో హాస్పిటల్ లో చేరిక.. ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం
Advertisement
Advertisement
Advertisement