
Delhi, Feb 23: నోరోవైరస్ బారిన పడి ఏకంగా వందల మంది ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డ సంఘటన యూరప్ ట్రిప్‌లో చోటు చేసుకుంది. పి అండ్ ఓ క్రూయిజ్‌లో ఈ ఘటన జరుగగా ప్రస్తుతం ఈ నౌక బెల్జియం దగ్గర ఉన్నట్లు అధికారులు తెలిపారు(Norovirus Outbreak).
నోరో వైరస్ ధాటికి ప్రజలు రెస్టారెంట్,డెక్కులు, క్యాబిన్లపై వాంతులు చేస్తున్నారని ఓ ప్రయాణీకుడు తెలిపారు(P&O Cruise In Europe).క్రూయిజ్‌లో 5 వేల మంది ప్రయాణీకులు, 18 వేల మంది సిబ్బంది ఉండగా మెజార్టీ ప్రజలు ఈ లక్షణాలతో అనారోగ్యం బారిన పడ్డారని వెల్లడించారు.
నోరోవైరస్ అంటే?(What is Norovirus)
నోరోవైరస్ అనేది అంటువ్యాధి కలిగిన వైరస్. ఇది ప్రధానంగా కలుషితమైన ఆహారం, నీరు లేదా గాలి ద్వారా వ్యాపిస్తుంది. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడి, వాంతులు, విరేచనాలు, మలబద్ధకం, పొత్తికడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
నోరోవైరస్ లక్షణాలు:(Norovirus symptoms)
వాంతులు
విరేచనాలు
కడుపు నొప్పి
నీరసం
శరీరంలో ద్రవ పదార్థాల లోపం (డీహైడ్రేషన్)
నోరోవైరస్ బారిన పడకుండా ఉండేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు:(Norovirus Prevention)
()తరచూ చేతులు కడుక్కోవాలి – ముఖ్యంగా ఆహారం తినే ముందు, ముఖాన్ని తాకే ముందు సబ్బుతో చేతులు కడుక్కోవాలి.
()రోగులతో దూరంగా ఉండాలి – అనారోగ్య లక్షణాలు ఉన్న వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి.
()పరిసరాలను శుభ్రంగా ఉంచాలి – టేబుల్‌లు, డోర్ హ్యాండిల్స్, ఇతర ఎక్కువగా ముట్టుకునే ప్రదేశాలను శుభ్రం చేయాలి.
()నీరు లేద ద్రవ రూపంలో ఉండే వాటిని తీసుకోవాలి – అనారోగ్య లక్షణాలు ఉన్నప్పుడు ఎక్కువ నీళ్లు త్రాగి దేహాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.
(0తాజా ఆహారం తినాలి – తాజా ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. పంచుకునే పాత్రలు లేదా గ్లాసులు ఉపయోగించకూడదు.
నోరోవైరస్ కేసుల పెరుగుదల
ఇటీవల NHS ఇంగ్లాండ్ వెల్లడించిన డేటా ప్రకారం, రోజుకు సగటున 1,160 మంది రోగులు నోరోవైరస్ కారణంగా ఆసుపత్రిలో చేరుతున్నారు. 2012 నుండి ఇదే అత్యధికంగా నమోదైన సంఖ్య. అదేవిధంగా, ఈ ఏడాది ప్రారంభంలో అమెరికాలో CDC నోరోవైరస్ ఉద్ధృతిని ధృవీకరించింది.