Producer Dil Raju (Photo-Video Grab)

Hyderabad, AUG 17: ప్రేక్షకులు థియేటర్స్‌కు రాకుండా తామే చెడగొట్టామని టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు (Dil Raju) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. యువ న‌టుల‌తో వ‌స్తున్న తాజా చిత్రం ‘రేవు’. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమలో పాల్గొన్న దిల్‌ రాజు ఇండస్ట్రీలోని పరిస్థితుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో ఆడియన్స్‌ను థియేటర్‌కు రప్పించడం అనేది అంత‌ సులభం కాదు. ఒక్కప్పుడు ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించాలి అంటే ఇంకా ఏమేమి యాడ్‌ చేయాలని నేను కూడా ఆలోచించేవాడిని. నా వరకు అయితే ఆ పరిస్థితి లేదు. ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడంలో కొత్త వారికి మాత్రం బిగ్‌ ఛాలెంజ్‌గా మారింది. సినిమా తీయ‌డం గొప్ప కాదు. ఆ సినిమాను చూడ‌డానికి ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్‌ల వ‌ర‌కు తీసుకురావ‌డం ఇప్పుడు ఛాలెంజింగ్‌గా మారింది. ‘రేవు’ సినిమా సాంగ్స్ కానీ ట్రైల‌ర్ కానీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. మేము తీసిన ‘బలగం’, ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రాలు విడుద‌లైన చాలా రోజుల త‌ర్వాత మౌత్ టాక్ ద్వారా హిట్ అందుకున్నాయి. అదే స‌మయంలో రివ్యూలు కూడా పాజిటివ్‌గా వ‌చ్చాయి.

 

ప్రేక్ష‌కుల‌ను చెడగొట్టిందే మేము. సినిమా విడుదలయ్యాక నాలుగు వారాలు ఆగండి ఆ తర్వాత ఓటీటీలోకి (OTT) వ‌స్తుంది.. మీ ఇంట్లోనే కూర్చోని సినిమా చూడండి అని మేమే చెడగొట్టాం. కాబ‌ట్టి రేవు లాంటి సినిమాల‌కి మ‌న స‌పోర్ట్ ఉండాలి. రాంబాబు, ప్రభు నాకు చాలా మంచి సన్నిహితులు. వారు ఈ చిత్రం గురించి చెప్పారు. వీళ్లు వెనకాల ఉండి ఈ సినిమాను తీశారు కాబట్టి.. నేను ముందుండి నడిపించాలని అనుకున్నాను. ఇంత వరకు వీళ్ళు సినిమాని చూసి రివ్యూ రాసేవాళ్లు. ఇప్పుడు వీళ్లు తీసిన‌ సినిమా (రేవు) నేను చూసి రివ్యూ రాస్తా అని అన్నారు. చిన్న సినిమాల‌ను స‌పోర్ట్ చేయ‌డంలో నేను ఫ‌స్ట్ ప‌ర్స‌న్‌గా ఉంటాను. నాతో పాటు అగ్ర నిర్మాత‌లు వ‌చ్చి స‌పోర్ట్ చేయాలి అంటూ చెప్పుకోచ్చాడు.