Hyderabad, Aug 18: ప్రముఖ నేపథ్య గాయని పీ సుశీల (P Susheela Unwell) శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో బాధపడుతున్న ఆమెను చెన్నైలోని (Chennai) కావేరి ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. సుశీల ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హాస్పిటల్ వైద్యులు తెలిపారు.
ప్రముఖ గాయని పి.సుశీల శనివారం అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పితో బాధపడ్డారు. ఆమెను చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం పి.సుశీల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. pic.twitter.com/zMLU3ukUkz
— Newsmeter Telugu (@NewsmeterTelugu) August 18, 2024
కోలుకోవాలని ప్రార్థనలు
సుశీల పలు భాషల్లో లెక్కలేనన్ని పాటలు పాడారు. సంగీత ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సంగీత ప్రపంచంలో ఆమె చేసిన సేవలకు పద్మభూషణ్ తో భారత ప్రభుత్వం గౌరవించింది. కాగా ఆమె వీలైనంత త్వరగా కోలుకోవాలని, హాస్పిటల్ నుంచి డిచార్జ్ అవ్వాలని సినీ ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానులు కోరుకుంటున్నారు.