Allu Arjun Craze in Kerala: కేర‌ళ‌లో అల్లు అర్జున్ క్రేజ్ చూస్తే మ‌తి పోవాల్సిందే! మ‌ల్లు అర్జున్ అంటూ వెలిసిన పోస్ట‌ర్లు, వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన ఫ్యాన్స్

ఐకాన్ స్టార్‌కు (Icon Star) తెలుగులో మాత్రమే కాదు.. మలయాళంలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అల్లు అర్జున్‌ (Allu Arjun) పుష్ప చిత్రానికి మలయాళంలో భారీ కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. పుష్ప-2 ప్రమోషన్లలో భాగంగా కేరళలోని కొచ్చి లివా మాల్‌లోని గ్రాండ్ హయత్‌లో ఈవెంట్ జ‌రిగింది.

Allu Arjun Craze in Kerala

Kochi, NOV 27: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం పుష్ప-2 ది రూల్ (Pushpa 2). ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. మరో వారం రోజుల్లో థియేటర్లను షేక్ చేయనున్నాడు పుష్పరాజ్(Pushpa Raj). రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ మేకర్స్‌ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీ అయిపోయారు. ఇటీవల చెన్నైలో కిస్సిక్‌ సాంగ్‌ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఐకాన్ స్టార్‌కు (Icon Star) తెలుగులో మాత్రమే కాదు.. మలయాళంలో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. అల్లు అర్జున్‌ (Allu Arjun) పుష్ప చిత్రానికి మలయాళంలో భారీ కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. పుష్ప-2 ప్రమోషన్లలో భాగంగా కేరళలోని కొచ్చి లివా మాల్‌లోని గ్రాండ్ హయత్‌లో ఈవెంట్ జ‌రిగింది.

Allu Arjun Craze in Kerala

 

ఈ భారీ ఈవెంట్‌కు హాజరయ్యేందుకు ఐకాన్ స్టార్ కేరళకు వస్తున్న సందర్భంగా కొచ్చి అంతటా భారీ హోర్డింగ్స్‌ మెరిశాయి. పుష్ప-2 పోస్టర్లతో నగరమంతా నింపేశారు. అంతేకాదు ఎయిర్‌పోర్ట్‌ వద్ద ఐకాన్ స్టార్‌ కోసం ఫ్యాన్స్‌ ఎంతోమంది పోస్టర్లతో దర్శనమిచ్చారు.

Keralam Welcomes Mallu Arjun

 

కాగా.. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న పుష్ప-2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. పుష్పలో మెప్పించిన శ్రీవల్లిగా మరోసారి రష్మిక ఫ్యాన్స్‌ను అలరించనుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, కిస్సిక్‌ సాంగ్‌ యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నారు. ఓవర్‌సీస్‌లో టికెట్‌ బుకింగ్‌ ఓపెన్ కాగా.. రికార్డ్ స్థాయిలో టికెట్స్ అమ్ముడయ్యాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement