Shraddha & Shreyas Spark Dating Rumours: టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ ప్రేమ‌లో బాలీవుడ్ టాప్ హీరోయిన్, సోష‌ల్ మీడియాలో ఒక‌రినొక‌రు ఫాలో అవుతున్న శ్ర‌ద్ధ క‌పూర్, శ్రేయాస్ అయ్య‌ర్

ఆమె మ‌రెవ‌రో కాద‌ని బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ (Shraddha Kapoor) అని అంటున్నారు. శ్ర‌ద్ధా క‌పూర్ (Shraddha Kapoor) టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు సైతం సుప‌రిచిత‌మే.

Shraddha & Shreyas (PIC@ Instagram)

Mumbai, March 07: గ‌త‌కొంత‌కాలంగా టీమ్ఇండియా మిడిల్ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ (Shreyas Iyer) వార్త‌ల్లో నిలుస్తున్నాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో విఫ‌లం కావ‌డంతో అత‌డిపై వేటు ప‌డింది. రంజీట్రోపీలో ఆడాల‌ని సూచించ‌గా వెన్నుగాయం అంటూ త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశాడు. అత‌డు ఫిట్‌గానే ఉన్నాడ‌ని ఎన్‌సీఏ స‌ర్టిఫికేట్ ఇవ్వ‌డంతో స‌మ‌స్య మొద‌లైంది. ఈ క్ర‌మంలో అత‌డు బీసీసీఐ సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. మొన్న‌టి వ‌ర‌కు కెరీర్ ప‌రంగా వార్త‌ల్లో నిలిచిన అయ్య‌ర్ ప్ర‌స్తుతం వ్య‌క్తిగ‌త విష‌యాల్లోనూ తెర‌పైకి వ‌చ్చాడు. అత‌డు ప్రేమ‌లో ప‌డిన‌ట్లుగా సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. ఓ బాలీవుడ్ హీరోయిన్‌తో మొద‌లైన స్నేహం ప్రేమ‌గా మారింద‌ని స‌ద‌రు వార్త‌ల సారాంశం.

Varalaxmi Sarathkumar Engagement: 38 ఏళ్ల వ‌య‌స్సులో పెళ్లిపీట‌లెక్క‌బోతున్న తెలుగు లేడీ విల‌న్, నిశ్చితార్ధం ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్, ఇంత‌కీ పెళ్లికొడుకు ఎవ‌రంటే? 

ఆమె మ‌రెవ‌రో కాద‌ని బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధా క‌పూర్ (Shraddha Kapoor) అని అంటున్నారు. శ్ర‌ద్ధా క‌పూర్ (Shraddha Kapoor) టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు సైతం సుప‌రిచిత‌మే. ఆమె ప్ర‌భాస్ (Prabhas) హీరోగా న‌టించిన సాహోలో హీరోయిన్‌గా న‌టించింది. కాగా.. శ్రేయ‌స్ అయ్య‌ర్‌, శ్ర‌ద్ధాలు ప్రేమ‌లో ప‌డిన‌ట్లు వార్త‌లు రావ‌డానికి ఓ కార‌ణం ఉంది. ఇటీవ‌ల వీరిద్ద‌రు క‌లిసి ఓ యాడ్‌లో న‌టించారు. ఒక‌రి సోష‌ల్ మీడియా ఖాతాల‌ను మ‌రొక‌రు ఫాలో కావ‌డంతో ఇద్ద‌రూ సీక్రెట్‌గా డేటింగ్ చేస్తున్నారంటూ ఆంగ్ల మీడియాలో క‌థ‌నాలు వచ్చాయి.  అయితే..ఈ వార్త‌ల‌పై ఇంత‌వ‌ర‌కు అటు శ్రేయ‌స్ అయ్య‌ర్ గానీ, ఇటు శ్ర‌ద్ధా గానీ స్పందించ‌లేదు. కాగా.. వీరిద్ద‌రు క‌లిసి బ‌య‌ట తిరిగిన దాఖ‌లాలు లేవు. దీంతో ఇది ఓ రూమ‌ర్ మాత్ర‌మేన‌ని కొంత మంది నెటిజ‌న్లు అంటున్నారు.



సంబంధిత వార్తలు