Varalaxmi Sarathkumar Engagement: 38 ఏళ్ల వ‌య‌స్సులో పెళ్లిపీట‌లెక్క‌బోతున్న తెలుగు లేడీ విల‌న్, నిశ్చితార్ధం ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్, ఇంత‌కీ పెళ్లికొడుకు ఎవ‌రంటే?

రలక్ష్మి శరత్ కుమార్ ముంబైకి చెందిన పెయింట్ ఆర్టిస్ట్ నికోలయ్ సచ్‌దేవ్ ని నేడు నిశ్చితార్థం చేసుకుంది. ఇరు ఫ్యామిలీలు ఈ వేడుకలో పాల్గొన్నాయి. ఈ నిశ్చితార్థం ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Varalaxmi Sarathkumar Engagement: 38 ఏళ్ల వ‌య‌స్సులో పెళ్లిపీట‌లెక్క‌బోతున్న తెలుగు లేడీ విల‌న్, నిశ్చితార్ధం ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్, ఇంత‌కీ పెళ్లికొడుకు ఎవ‌రంటే?
Varalaxmi Sarathkumar Engagement (PIC@ X)

Chennai, March 02: తమిళ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ కూతురిగా తమిళ్ లో పొడా పోడి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar). ఓ పక్క హీరోయిన్ గా సినిమాలు చేస్తూనే నెగిటివ్ క్యారెక్టర్స్ కూడా చేసింది. హీరోయిన్ గా కంటే కూడా వరలక్ష్మీ (Varalaxmi Sarathkumar) విలన్ గానే ఎక్కువ సక్సెస్ అవ్వడంతో హీరోయిన్ వదిలేసి లేడీ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయింది. తెలుగులో క్రాక్, వీరసింహ రెడ్డి, నాంది.. లాంటి సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులని మెప్పించింది. సౌత్ లోని అన్ని భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ఇప్పటికే 50 సినిమాలు పూర్తి చేసేసింది. ఈ తమిళ్ భామకు 38 ఏళ్ళు వచ్చినా పెళ్లి గురించి మాట్లాడేది కాదు. పెళ్లి గురించి అడిగినా సమాధానం చెప్పలేదు. తాజాగా నిశ్చితార్థం చేసుకొని (Varalaxmi Sarathkumar Engagement) ఫొటోలతో అందరిని ఆశ్చర్యపరిచింది.

 

వరలక్ష్మి శరత్ కుమార్ ముంబైకి చెందిన పెయింట్ ఆర్టిస్ట్ నికోలయ్ సచ్‌దేవ్ ని నేడు నిశ్చితార్థం చేసుకుంది. ఇరు ఫ్యామిలీలు ఈ వేడుకలో పాల్గొన్నాయి. ఈ నిశ్చితార్థం ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో ఈ కొత్త జంటకు అభిమానులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సంవత్సరమే వీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం.

(The above story first appeared on LatestLY on Mar 02, 2024 11:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).