Sreeleela Special Song In Pushpa The Rule 2: పుష్ప -2లో శ్రీ‌లీల ఐటెం సాంగ్, ఇంట‌ర్నెట్ వైర‌ల్ అవుతున్న ఫోటో ఇదుగోండి!

పుష్ఫ 2లో స్పెష‌ల్ సాంగ్ చేస్తుంది శ్రీలీల‌. తాజాగా ఈ పాట షూటింగ్‌కు సంబంధించిన ఒక పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఫొటోలో అల్లు అర్జున్ ఎర్ర రంగు డ్రెస్‌లో ఉండ‌గా.. శ్రీలీల హాట్ హాట్‌గా కనిపిస్తుంది.

Pushpa The Rule 2

ShraHyderabad, NOV 08: టాలీవుడ్ స్టార్ ద‌ర్శ‌కుడు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కాంబోలో వ‌స్తున్న తాజా చిత్రం పుష్ప ది రూల్(Pushpa2The Rule). ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ పుష్ప సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తుంది. ర‌ష్మిక మందాన్న (Rashmika Mandanna) క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 05న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమాలో స్పెష‌ల్ సాంగ్ (Pushpa The Rule 2) త‌ప్ప మిగతా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న విష‌యం తెలిసిందే. ఇక ఈ స్పెష‌ల్ సాంగ్‌ను ఎవ‌రు చేస్తున్నారా అనే దానిపై కూడా ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

Vijay Devarakonda: హీరో విజయ్ దేవరకొండకు తప్పిన ప్రమాదం, మెట్లపై నుండి జారి పడ్డ విజయ్..ముంబైలో ఘటన, వీడియో ఇదిగో 

ఒక‌వైపు స‌మంత‌నే మ‌ళ్లీ చేస్తుంది అన‌గా.. ఇంకోవైపు బాలీవుడ్ భామ శ్రద్ధ క‌పూర్ (Shradda Kapoor) ఐటం సాంగ్ చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే శ్రద్ధ క‌పూర్ ఈ పాట కోసం ఎక్కువ మొత్తంలో పారితోషికం అడుగుతుండ‌డంతో టాలీవుడ్ న‌టి శ్రీలీలను (Sreeleela) ఈ సాంగ్ కోసం తీసుకున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

Sreeleela Special Song In Pushpa The Rule 2

 

అయితే ఇదే వార్త ఇప్పుడు నిజం అయ్యింది. పుష్ఫ 2లో స్పెష‌ల్ సాంగ్ చేస్తుంది శ్రీలీల‌. తాజాగా ఈ పాట షూటింగ్‌కు సంబంధించిన ఒక పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఫొటోలో అల్లు అర్జున్ ఎర్ర రంగు డ్రెస్‌లో ఉండ‌గా.. శ్రీలీల హాట్ హాట్‌గా కనిపిస్తుంది.