Sunitha Boya Nude Protest: మరోమారు హల్‌చల్ చేసిన సునీత బోయ.. గీతా ఆర్ట్స్ కార్యాలయం ముందు నగ్నంగా బైఠాయింపు.. బన్నీవాసు తనను మోసం చేశాడని ఆరోపణ.. వీడియోలో ఆమె ఏమన్నదంటే??

ప్రముఖ నిర్మాత బన్నీవాసు తనను మోసం చేశాడని గత కొంతకాలంగా ఆరోపిస్తున్న ఆమె గతంలో పలుమార్లు గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. తాజాగా, గత రాత్రి మరోమారు కార్యాలయం వద్దకు చేరుకుని నగ్నంగా బైఠాయించింది.

Credits: Video Grab

Hyderabad, Nov 18: సునీత బోయ (Sunitha Boya) మరోసారి హల్‌చల్ చేసింది. ప్రముఖ నిర్మాత బన్నీవాసు (Bunny Vasu) తనను మోసం (Cheat) చేశాడని గత కొంతకాలంగా ఆరోపిస్తున్న ఆమె గతంలో పలుమార్లు గీతా ఆర్ట్స్ (Geetha Arts) కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. తాజాగా, గత రాత్రి మరోమారు కార్యాలయం వద్దకు చేరుకుని నగ్నంగా (Nude) బైఠాయించింది. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న జూబ్లీహిల్స్ మహిళా పోలీసులు ఆమె  ఒంటిపై దుస్తులు కప్పి ఆమెకు నచ్చజెప్పారు.

లైగర్ సినిమాలో ఎమ్మెల్సీ కవిత పెట్టుబడులు ఉన్నాయని కాంగ్రెస్ నేత ఫిర్యాదు.. ఈడీ విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్, చార్మి.. జనగణమన సినిమా పెట్టుబడులపైనా ఆరా.. పూరీ, చార్మిలను వేర్వేరుగా పది గంటలకు పైగా విచారించిన అధికారులు

ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ తనకు నెలవారీ ఖర్చులకు కొంత ఇబ్బందిగా ఉందని పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. బన్నీ వాసు ప్రస్తుతం ఇతర ప్రాంతంలో షూటింగులో ఉన్నాడని, వచ్చాక మాట్లాడతామని చెప్పిన పోలీసులు ఆమెకు కొన్ని డబ్బులు ఇచ్చి అక్కడి నుంచి పంపించారు. కాగా, గతంలోనూ పలుమార్లు గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద సునీత ఆందోళన చేసింది. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు మానసిక స్థితి సరిగా లేదని చెబుతూ ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు ఆమెను అప్పగించారు. అయితే, రోడ్డుపై నగ్నంగా ప్రదర్శన ఇవ్వడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. గతంలో శ్రీరెడ్డి కూడా ఇలాగే చేసిందని, పబ్లిసిటీ స్టంట్ లో ఇదో భాగమని మండిపడుతున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే, మరో విధంగా నిరసనను తెలియజేయాలని, ఇది పద్ధతి కాదని హితవు చెబుతున్నారు.



సంబంధిత వార్తలు

Geetha Arts Express Gratitude To TG Govt: సీఎం రేవంత్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు! అల్లు అర‌వింద్ నేతృత్వంలోని గీతా ఆర్ట్స్ పోస్ట్, ఇంకా ఏమ‌న్నారంటే?

Police Angry On Allu Arjun: సినిమా వాళ్ళ బట్టలు ఊడతీస్తాం..అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. లేదంటే తోలు తీస్తాం అని హెచ్చరించిన ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి

DGP Jitender: వారు సినిమాల్లోనే హీరోలు...బయట పౌరులే, చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న డీజీపీ జితేందర్, మోహన్ బాబుది ఫ్యామిలీ పంచాయితీ అన్న తెలంగాణ డీజీపీ

BJP MP Purandeswari: అల్లు అర్జున్‌ని టార్గెట్ చేయడం సరికాదు, తొక్కిసలాట అనుకోకుండా జరిగిన సంఘటన..ఏ11గా ఉన్న బన్నీ అరెస్ట్ సరికాదన్న ఎంపీ పురందేశ్వరి