Hyd, December 22: అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. లేదంటే తోలు తీస్తాం అని మండిపడ్డారు ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి. అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయాలి అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన ఏసీపీ...మా పోలీసులు తలచుకుంటే అల్లు అర్జున్ రీల్స్ కట్ అవుతాయి - ఏసీపీ విష్ణు మూర్తి చనిపోయిన రేవతి కుటుంబానికి అల్లు అర్జున్ లంచం ఇస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అల్లు అర్జున్ ఏమైనా తీస్ మార్ ఖాన్ అనుకుంటున్నాడా...అసలు అల్లు అర్జున్ కి తెలంగాణలో ఆధార్ కార్డు ఉందా! చెప్పాలన్నారు. పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు అంటున్నావు.. నీకు ఎందుకు చెప్పాలి నువ్వు ఏమన్నా తీస్ మార్ ఖాన్ అనుకుంటున్నావా....నువ్వు మామూలు పౌరుడివి.. నీకు ఆధార్ కార్డు ఆంధ్రలో ఉందా తెలంగాణలో ఎక్కడ ఉందో కూడా తెలియదు అన్నారు. అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ళ దాడి, రేవతి కుటుంబానికి క్షమాపణ చెప్పాలని ఓయూ జేఏసీ డిమాండ్..వీడియో
అసెంబ్లీలో నీ వల్ల గంట సమయం పోయింది.. నీ గురించి మేము ఎందుకు బాధపడాలి, తెలంగాణ సమాజం సౌమ్యులు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చేస్తున్నారు - ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి సినిమా వాళ్ల దాదాగిరి ఏంటి చెప్పాలన్నారు. ఇష్టమొచ్చినట్లు టికెట్ రేట్లు పెంచారు...ఇన్ని కోట్లు పెట్టి సినిమాలు తీయమని మేము బ్రతిమిలాడామా? చెప్పాలన్నారు.
ACP Sabbati Vishnu Murthy blasts on Allu Arjun
అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. లేదంటే తోలు తీస్తాం - ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి https://t.co/XjY9IKmOIS pic.twitter.com/3PUTYsXWOa
— Telugu Scribe (@TeluguScribe) December 22, 2024
సినిమా వాళ్ళ బట్టలు ఊడతీస్తాం...మీరు ఉన్నదే లీజు జాగాలో.. జూబ్లీహిల్స్ ఏరియాలో మీకు అంత పెట్టి డబ్బులు ఎక్కడివి చెప్పాలన్నారు. అప్పట్లో ఉన్న రాజకీయ నాయకులు ఎవరో ఇండస్ట్రీ అభివృద్ది కావాలని మీకు భూములు ఇచ్చారు...వాపు చూసి బలం అనుకోవద్దు అని ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.