Allu Aravind (photo-Video Grab)

Hyderabad, DEC 26: తెలుగు చిత్రసీమ (Telugu Cinema Industry)కు సంబంధించిన పలు అంశాలు చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డితో (Komati Reddy Venkat Reddy) సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశమయ్యారని తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం పురోభివృద్ధి సాధించడంలో భాగంగా సినిమా పరిశ్రమకు కూడా ప్రజాప్రభుత్వం తగిన ప్రాధాన్యతను ఇస్తోందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ వేదికపై ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా సినీ ఇండస్ట్రీకి మద్దతు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) ప్రముఖ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ (Geetha Arts) ధన్యవాదాలు తెలియజేసింది.

Tollywood Industry Meets CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన సినీ ప్రముఖులు, టాలీవుడ్ కు ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదనలు ఇవే.. 

ఈ మేరకు సీఎం రేవంత్‌ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అందిస్తున్న సహకారానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు అధికారిక ఎక్స్‌ ఖాతాలో ట్వీట్ చేసింది.

Geetha Arts Express Sincere Gratitude To The Telangana Government

 

ఒక పరిశ్రమగా ప్రభుత్వ ప్రగతిశీల కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడం, కీలకమైన సామాజిక సమస్యలపై అవగాహన పెంచడం.. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రోత్సహించడంలో అంకితభావంతో మేమంతా ఐక్యంగా ఉన్నాం. సమాజ అభివృద్ధికి, మా సినీ పరిశ్రమ నిరంతర వృద్ధికి గణనీయమైన సహకారం అందించాలని మేమంతా లక్ష్యంగా పెట్టుకున్నామని గీతా ఆర్ట్స్‌ ఓ సందేశాన్ని పోస్ట్‌ చేసింది.