తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ సమావేశం జరిగింది అంతకు ముందే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహతో పాటు సినీ పరిశ్రమకు చెందిన 36 మంది ప్రముఖులు అక్కడకు చేరుకున్నారు. సినీ ప్రముఖులతో మంత్రులు ప్రాథమిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున సినీ ప్రముఖుల ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టినట్టు తెలుస్తోంది.

టాలీవుడ్ కు ప్రభుత్వం వైపు నుంచి ప్రతిపాదనలు:

డ్రగ్స్ కు వ్యతిరేకంగా సినిమా హీరోలు, హీరోయిన్లు ప్రచార కార్యక్రమాల్లో కచ్చితంగా పాల్గొనాలి.

గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు వ్యతిరేకంగా ప్రచారాన్ని నిర్వహించాలి.

సినిమా టికెట్లపై విధించే సెస్సును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాలకు వినియోగించాలి.

కులగణన సర్వే ప్రచార కార్యక్రమానికి సినీ తారలు సహకరించాలి.

బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండకపోవచ్చు.

సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ...సినిమా పరిశ్రమ సమలస్యలపై చర్చ...ఇండస్ట్రీ పెద్దలు హాజరు

 సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన సినీ ప్రముఖులు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)