Rajinikanth Thalaivar 169: రజనీకాంత్ కొత్త మూవీ ఖరారు, హిట్ డైరక్టర్ కు ఛాన్స్ ఇచ్చిన సూపర్‌ స్టార్, అనౌన్స్ మెంట్ వీడియోలో అదరగొట్టిన తలైవా, స్టైలిష్ గా కనిపిస్తున్న దర్శకుడు

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) కొత్త మూవీ అప్‌డేట్ వచ్చింది. చాలా రోజులుగా వార్తల్లో వినిపిస్తున్నట్లుగానే నెల్సన్ దిలీప్ కుమార్‌ (Nelson dilp kumar) తో రజనీ నెక్ట్స్ మావీ చేయబోతున్నారు. దీనిపై సన్ పిక్చర్స్ (Sun Pictures) స్పష్టత ఇచ్చింది.

Chennai, Feb 10: సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) కొత్త మూవీ అప్‌డేట్ వచ్చింది. చాలా రోజులుగా వార్తల్లో వినిపిస్తున్నట్లుగానే నెల్సన్ దిలీప్ కుమార్‌ (Nelson dilp kumar) తో రజనీ నెక్ట్స్ మావీ చేయబోతున్నారు. దీనిపై సన్ పిక్చర్స్ (Sun Pictures) స్పష్టత ఇచ్చింది. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూవీ అప్ డేట్ ఇచ్చింది. తలైవార్ 169 (Thalaivar 169) అనే పేరుతో మూవీ సెట్స్ మీదకు వెళ్తోంది. నిజానికి రజనీకాంత్ (Rajinikanth) 169వ చిత్రంపై కోలీవుడ్‌లో గత కొన్ని రోజులుగా చర్చ సాగుతోంది. ‘డాక్టర్‌’ ఫేం నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారంటూ వార్తలొచ్చాయి. అయితే రజనీకాంత్‌- నెల్సన్‌ కాంబినేషన్‌లో సినిమాని రూపొందిస్తున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసింది.

ఇందులో నెల్సన్‌, రజనీకాంత్‌, సంగీత దర్శకుడు అనిరుధ్‌ (Anirudh) స్టైలిష్‌ లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకునేలా ఉన్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. రజనీకాంత్‌ ఇటీవల ‘అన్నాత్తే’ (పెద్దన్న) చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించారు.

Phalke Award to Rajinikanth: రజినీ కాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం, తలైవాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ; త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు

రజనీకాంత్ కొత్త మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తుండటం, గతంలో డాక్టర్ మూవీతో నెల్సన్ మంచి హిట్ కొట్టడంతో...కొత్త సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అయితే రజనీకాంత్ కూడా యంగ్ డైరక్టర్లకు ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారు. గతంలో పా రంజిత్‌ తో రెండు మూవీస్ చేసిన ఆయన..తాజాగా నెల్సన్ దిలీప్ కుమార్ కు అవకాశమివ్వడం హాట్ టాపిక్ గా మారింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement