Srimanthudu Copyright Dispute: శ్రీమంతుడు కాపీరైట్ వివాదం, సుప్రీంకోర్టులో దర్శకుడు కొరటాల శివకు ఎదురుదెబ్బ, క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సిందేనని తీర్పు

ప్రముఖ సినీ దర్శకుడు కొరటాల శివకు సుప్రీంకోర్టులో (Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది. శ్రీమంతుడు కాపీరైట్ వివాదంలో నాంపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది.

Koratala Siva (Photo-Wikimedia Commons)

ప్రముఖ సినీ దర్శకుడు కొరటాల శివకు సుప్రీంకోర్టులో (Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది. శ్రీమంతుడు కాపీరైట్ వివాదంలో నాంపల్లి కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో కొరటాల శివ తెరకెక్కించిన 'శ్రీమంతుడు' చిత్రం 2015లో విడుదలై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

అయితే స్వాతి పత్రికలో వచ్చిన తన కథను కాపీ చేసి (Srimanthudu Copyright Dispute) ఈ చిత్రాన్ని తెరకెక్కించారంటూ రచయిత శరత్ చంద్ర నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ.. కొరటాల శివ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

ఎన్టీఆర్ దేవర నుంచి ఫోటో లీక్, సెట్స్ నుంచి తన ఫోటో పోస్ట్ చేసిన జాన్వి కపూర్, ఇంతకీ మూవీలో జాన్వి పాత్ర పేరు ఏంటో తెలుసా?

గతంలో శ్రీమంతుడు కథను కాపీ కొట్టారంటూ తన వద్ద ఉన్న ఆధారాలను విచారణ సమయంలో రచయిత శరత్‌ చంద్ర సమర్పించారు. వాటిని పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం రచయితల సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా నాంపల్లి కోర్టు ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. దీంతో డైరెక్టర్‌ కొరటాల శివ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నేడు కొరటాల శివ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

సినిమా విడుదలైన 8 నెలల తర్వాతే శరత్‌ చంద్ర కోర్టును ఆశ్రయించారని.. హైకోర్టు, స్థానిక కోర్టు తమ వాదనలను పరిగణనలోకి తీసుకోలేదని కొరటాల తరఫున సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే రచయితల సంఘం నివేదిక ఆధారంగానే స్థానిక కోర్టు నిర్ణయం తీసుకుందని.. తీర్పులో స్పష్టమైన అంశాలు పొందుపరిచిందని సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

సినిమా రీషూట్‌ చేస్తే తప్పు ఏముంది, అంత పెద్ద తప్పుగా ఎందుకు చూస్తున్నారని అసహనం వ్యక్తం చేసిన దర్శకుడు కొరటాల, ఆచార్య మూవీని రీషూట్‌ చేయలేదని వెల్లడి

కొరటాల పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ హృషికేశ్ రాయ్ ల ధర్మాసనం... ఆయన పిటిషన్ ను కొట్టివేసింది. స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. కొరటాల శివ పిటిషన్‌పై తదుపరి విచారణ జరపడానికి ఏమీ లేదని స్పష్టం చేసింది.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Share Now
Advertisement