Janhvi Kapoor Photo From Devara: ఎన్టీఆర్ దేవర నుంచి ఫోటో లీక్, సెట్స్ నుంచి తన ఫోటో పోస్ట్ చేసిన జాన్వి కపూర్, ఇంతకీ మూవీలో జాన్వి పాత్ర పేరు ఏంటో తెలుసా?
Janhvi Kapoor Photo From Devara (PIC@ Instagram)

Hyderabad, NOV 01: కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ‘దేవ‌ర‌’ (Devara). రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ క‌పూర్ (Janhvi Kapoor) దేవరలో హీరోయిన్‌గా నటిస్తుంది. సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు షైన్ టామ్‌ చాకో విలన్స్ గా కనిపించబోతున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ.. ఇటీవల గోవా షెడ్యూల్ ని మొదలు పెట్టుకుంది. అక్కడ ఎన్టీఆర్ అండ్ జాన్వీ పై ఇంపార్టెంట్ సీన్స్ తెరకెక్కించారట. జాన్వీ ఆ షూటింగ్ పూర్తి చేసేసుకొని ముంబై వచ్చేసింది. అయితే తాజాగా జాన్వీ ఆ సెట్స్ లోని ఒక ఫోటో షేర్ చేస్తూ (Janhvi Kapoor Leaks Photo).. “దేవర సెట్స్‌ని, టీంని, ‘తంగం’గా నటించడం మిస్ అవుతున్నాను” అంటూ ఒక పిక్ ని లీక్ చేసింది. ఈ పోస్టు బట్టి చూస్తే ఈ సినిమాలో జాన్వీ పాత్ర పేరు ‘తంగం’ అని తెలుస్తుంది. తంగం (Thangam) అంటే బంగారం అని అర్ధం అంటా. ఈ పిక్ లోని జాన్వీ లుక్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. హాఫ్ శారీలో పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తూ మెస్మరైజ్ చేస్తుంది.

 

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

కాగా ఈ సినిమాని మిక్కిలినేని సుధాకర్ తో కలిసి నందమూరి కళ్యాణ్ రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ మెయిన్ హైలైట్ కానుందట. దీంతో ఈ సీక్వెన్స్ ని తెరకెక్కించడానికి మేకర్స్ పలువురు హాలీవుడ్ మేకర్స్ ని కూడా రప్పించారు. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీకి అనిరుద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పై అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి వారి నమ్మకాన్ని అనిరుద్ నిలబెడతాడా లేదా చూడాలి. కాగా ఈ సినిమా పార్ట్ 1 వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.