Sye Raa Narasimha Reddy Review: మనసులు గెలిచావురా... సైరా! ఆనాటి స్యాతంత్య్రోద్యమ పోరాటం చూస్తే రెండు కళ్లు సరిపోవు, సినిమాలో ఒక శిఖరంలా నిలిచిన చిరంజీవి, ఇదిగో సైరా నరసింహా రెడ్డి రివ్యూ

ఎన్నో చారిత్రాత్మక డ్రామాలు తెరకెక్కాయి. ఆనాటి పోరాటాలను కళ్లకు కట్టినట్లుగా చూపాయి. అయితే ఒక ప్రాంత విముక్తి కోసం జరిగిన పోరాటాన్ని దేశానికి సంబధించిన పోరాటంగా చూపించడమనేది చాలా తక్కువ సినిమాల్లో చూసి ఉంటాం. అలాంటి సినిమాలో ముందు వరసలో సైరా నరసింహారెడ్డి...

Sye Raa Narasimha Reddy Movie Review (Photo Credits: File Image)

మనం ఈనాడు స్వేచ్చగా ఊపిరి పీలుస్తున్నామంటే అది ఎందరో త్యాగధనుల ఫలం. బ్రిటీష్ వారి పాలన నుంచి దేశానికి విముక్తిని ప్రసాదించి చరిత్ర పుటల్లో లిఖించదగ్గ స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలు మనం చూడకపోయినా, వాటిని పుస్తకాల్లో చదివి పోరాటం అలా జరిగింది, యుద్ధం ఇలా జరిగిందని ఊహించుకుని గర్వపడతాం.  అలాంటి ఊహాత్మక ఆలోచనలు ఎంతో అందంగా రూపుదిద్దుకొని, ఇప్పటికే ఎన్నో చారిత్రాత్మక డ్రామాలు తెరకెక్కాయి. ఆనాటి పోరాటాలను కళ్లకు కట్టినట్లుగా  చూపాయి. అయితే ఒక ప్రాంత విముక్తి కోసం జరిగిన పోరాటాన్ని దేశానికి సంబధించిన పోరాటంగా చూపించడమనేది చాలా తక్కువ సినిమాల్లో చూసి ఉంటాం. అలాంటి సినిమాలలో ముందు వరసలో ఉంటుంది సైరా నరసింహారెడ్డి.  సినిమాలోకెళితే..

కథ- స్క్రీన్ ప్లే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్‌తో 'సైరా' కథ ప్రారంభమవుతుంది.  యుద్ధంలో తెల్లదొరలు మనసైన్యాన్ని చంపేయగా ఓ వంద మంది సైన్యం మిగిలుంటారు. ఆ వందమంది యుద్ధం చేయడం మన వల్ల కాదని లొంగిపోదామని మాట్లాడుకుంటుండగా ఝాన్సీ లక్ష్మీభాయి ( అనుష్క) కత్తితో దూసుకువస్తుంది. ఆ వందమంది సైన్యంతో మనం తక్కువ మందిమి ఉన్నామని భయపడుతున్నారా అని వారి వైపు కోపంగా చూస్తూ.. చరిత్రలో ఓ మహా వీరుడు ఒక్కడే బ్రీటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడని చెబుతూ ఉంటుంది. ఆ మహా వీరుడే సైరా నరసిహంరెడ్డి (Sye Raa Narasimha Reddy) ఆయన పుట్టుకే మరణం లేని పుట్టుక అంటూ సైరా గొప్పదనాన్ని వివరించే ప్రయత్నంతో సినిమా ముందుకు సాగుతుంది. అయితే ఇక్కడ కొంచెం సినిమా సాగదీసినట్లుగా అనిపిస్తుంది. సైరా పెరిగి పెద్దవాడవడం ప్రేమలో పడటం, చిన్నప్పుడే పెళ్లి అయిందని అమితాబ్ చెప్పడం లాంటి సన్నివేశాలు కొంచెం ప్రేక్షకులకు కొంత విసుగు  తెప్పిస్తాయనే చెప్పాలి. ఎందుకంటే ఓ పోరాట యోధుడి సినిమాని చూస్తున్నప్పుడు ఇలాంటి సన్నివేశాలు ప్రేక్షకులకు అంతగా రుచించవు. ఫస్ట్ లోనే లవ్ ట్రాకా అనే ఆలోచనను కలిగిస్తాయి. అయితే ఇక్కడ తమన్నా అలాంటి ఫీల్ కలగకుండా కొంచెం తన నటనతో అలరించిందనే చెప్పుకోవాలి. దేవుడి కోసం నాట్యం చేస్తున్నానని సైరా చెప్పడం, దేవుడి కూడా ప్రజల కోసమే కాబట్టి నీవు కూా ప్రజల కోసం నీ నాట్య సందేశాలను అందించూ అంటూ సాగే సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి.

తర్వాత బ్రీటిష్ వారికి సామంతులుగా మనం ఉన్నామని తెలిసిన సైరా వారిని ఎదిరించేందుకు 61 సామంత రాజుల ( పాలెగాండ్ల) ను ఏకం చేసే దిశగా సినిమా సాగుతుంది. అయితే అతని ప్రయత్నానికి సామంత రాజులు అడ్డు చెప్పడం పిరికివారిగా మారడం వంటి సన్నివేశాలతో కథనం కొంచెం ఊపందుకుంటుంది. అందర్నీ ఏకం చేసే సమయంలో జాతర ఏర్పాటు చేసిన సైరాకు మరో సామంత రాజు (సుదీప్) దాన్ని ఆపేందుకు కుట్ర పన్నుతాడు. ఇక్కడ జరిగే ఫైట్ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తుంది. చూపు తిప్పుకోనీయదు. ఇక్కడ బ్రిటీష్ వారి నుండి తమ ప్రాంతాన్ని కాపాడుకోవడమనే కాన్సెప్ట్ తో కథనం సాగుతుంది. పంచ్ డైలాగ్ లు అక్కడక్కడ బాగా ఆకట్టుకుంటాయి. భూమికి శిస్తు కట్టలేని రైతుల భూములను ఆక్రమించుకుంటున్న తెల్లదొరలకు వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో సైరా తెల్ల దొర తలను నరికేయడంతో ఇంటర్వెల్ అవుతుంది. తెల్లదొర తలను నరికే సీన్ కూడా నీటిలోపల తీయడమనే కాన్సెప్ట్ నిజంగా అద్భుతమనే చెప్పాలి.

'సైరా' థియేట్రికల్ ట్రైలర్ మరొకసారి ఇక్కడ చూడండి

ఇంటర్వెల్ తరువాత సినిమా నుంచి ప్రేక్షకుని తల తిప్పుకోనీయదు. తొలినాళ్లలో జరిగిన స్వాతంత్య్ర ఉద్యమ పోరాటాలు ప్రత్యక్షంగా చూస్తున్నట్లే కనిపిస్తుంది. ప్రతి సీన్ ఆనాటి యుద్ధాలను తలిపించే విధంగా దర్శకుడు తీర్చి దిద్దాడు. తెల్లదొరలను ఎదిరించడానికి సైరా తన సామ్రాజ్యాన్ని వదిలి 61 మంది సామంత రాజులతో ప్రజల మధ్యకు వెళ్లడం అక్కడ నుంచి పోరాటం చేయడంతో సెకండాఫ్ ని దర్శకుడు ముగిస్తాడు. ఈ పోరాటంలోనే సైరా భార్య (నయనతార) భర్తను ఉద్యమంలో స్వేచ్ఛగా పోరాటం చేయాలని అతని దగ్గర నుంచి దూరంగా వెళుతుంది. తన సొంత కోటకు వెళుతుంది. ఇది సైరా ఆమెను కోరిన తరువాత జరిగే సీన్. ఆ తర్వాత తమన్నా సైరా పోరాటాన్ని తనన పాటల ద్వారా నలు దిశలా వ్యాపింపజేయడం లాంటి సన్నివేశాలు చాలా బాగా అనిపిస్తాయి. తెల్ల దొరల చేతికి తమన్నా చిక్కడం అక్కడ తనను తాను అగ్నికి ఆహుతి చేసుకుని 300 మంది తెల్లవారిని చంపేయడం వంటి సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి.

సైరా అన్న మల్లారెడ్డి బ్రీటీష్ వారికి సైరా గురించి క్లూ అందించడం ఆయన్ని శిక్షించడమేనది అతని తల్లికే వదిలేయడం వంటి సీన్లు ఎమోషన్ ని తలపిస్తాయి. బ్రీటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న సైరాను అప్పగిస్తే భారీ నజరానానను అందిస్తామని తెల్లదొరల ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇక్కడే తమిళ విజయ్ సేతుపతి ప్రవేశం కనిపిస్తుంది. సైరాను వెతుక్కుంటూ రావడం అతనితో కలిసి పోరాటం చేయడం లాంటి సన్నివేశాల్లో బాగా కనెక్ట్ అయ్యాడు. పోరాటం ముందుకు సాగుతున్న సమయంలో సైరాను, ఫ్యామిలీని చంపేందుకు సామంత రాజులు కొందరు కుట్ర పన్నుతారు. అది తెలుసుకుని దాన్ని సైరా చేధిస్తాడు. ఇక్కడ బసిరెడ్డి ( జగపతిబాబు) కొడుకుని క్షమించి వదిలేస్తాడు సైరా. అతి బసిరెడ్డికి తెలియదు. దాంతో సైరా మీద పగ పెంచుకుంటాడు. అయితే దీన్ని అదనుగా తీసుకుని తెల్ల దొరలు బసిరెడ్డికి లేనిపోనివి చెప్పి సైరాను బందీగా పట్టుకునేందుకు అతని సహాయం కోరతారు.

ప్రతి ఏటా రేనాట ఉన్న కొండమీద కార్తీక దీపం సైరా వెలిగించడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. ఇక్కడ సైరాను పట్టుకునేందుకు పథకం వేస్తారు. అంతకుముందే సైరా చచ్చిపోయాడనే విషయాన్ని తెల్లదొరలు ప్రచారం చేస్తారు. అయితే ప్రజలు ఆ కొండ మీద ఉన్న దీపం వెలిగించడానికి సైరా వస్తాడని ఎదురుచూస్తుంటారు. ఆ రోజు రానే వస్తుంది. సైరా దీపం వెలిగించడానికి వస్తున్న సమయంలో జగపతిబాబు సైరాకు ప్రసాదంలో మత్తుమందు కలిపి ఇవ్వడంతో సైరా శక్తి సన్నగిల్లుతుంది. దీంతో తెల్లదొరలు సైరాను బందీగా పట్టుకుంటారు. ఇక్కడ కొడుకుని చూసిన బసిరెడ్డి తన తప్పు తెలుసుకుని ముఖం చూపించలేక కత్తితో పొడుచుకుని చనిపోతాడు.

సైరాను బందీగా పట్టుకున్న తరువాత బ్రిటీష్ కోర్టు సైరా చేసిన తప్పులను ఒప్పుకోమంటోంది. సైరా ఒప్పుకోకపోవడంతో మరణ శిక్ష విధిస్తుంది. చివరి కోరిక ఏంటని సైరాని అడిగితే మీరు మా దేశం నుండి వెళ్లిపోవడమేనని చెప్పడం హైలెట్ సీన్ గా చెప్పవచ్చు. ఆ తర్వాత అతనని ఉరి తీసే సమయంలో సైరా తెల్లదొరను నరికేయడం. ఇలా నరికివేసే సమయంలో సైరా తల నరేకయడంతో సైరా కథ ముగుస్తుంది. ఈ కధను చెప్పిన ఝాన్సీ లక్షీ భాయి ( అనుష్క) వారిలో పోరాట స్పూర్తిని రగిలించడం చివరగా మళ్లీ పవన్ వాయిస్ తో సినిమా ముగుస్తుంది.

హైలైట్స్

చిరంజీవి నటన

అమితాబ్ బచ్చన్

సెకండాఫ్

బుర్రా మాధవ డైలాగ్స్

విజువల్ ఎఫెక్ట్స్

వీక్ పాయింట్స్

ఫస్టాఫ్ కథనం

లేటెస్ట్‌లీ ఒపీనియన్ : ఇదివరకు ఎవరూ చేయని, మునుపెన్నడూ లేని విధంగా ఆ కాలంలో స్వాతత్య్రం కోసం జరిగిన మొట్టమొదటి ఉద్యమాన్ని మళ్ళీ మన కళ్ల ముందుకు తీసుకురావడం నిజంగా గర్వించదగ్గ విషయం. 'సైరా' ఖచ్చితంగా తెలుగు సినిమా స్థాయిని పెంచుతుంది. ఇందులోని లోపాలు, వివాదాలు పట్టించుకోకుండా ఈ సినిమాను ఒక పాజిటివ్ కోణంలో చూస్తే 'సైరా' ఈ ఏడాదిలోనే ది బెస్ట్ మూవీ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ రివ్యూపై మీ అభిప్రాయాన్ని  కింద కమెంట్ బాక్స్ లో  మాతో పంచుకొండి.

Rating:
3.5 out of 5

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now