Chandra Mohan No More: ప్రముఖ నటుడు చంద్ర మోహన్ కన్నుమూత.. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. చంద్రమోహన్ గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు.
Hyderabad, Nov 11: ప్రముఖ నటుడు చంద్రమోహన్ (Chandra Mohan) కన్నుమూశారు. హైదరాబాద్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈయన గతకొంతకాలంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. చంద్రమోహన్ గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా (Tollywood) రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. ఈయన కృష్ణా జిల్లా (Krishna District) లోని పమిడిముక్కల లో జన్మించారు. వీరు వ్యవసాయ కళాశాల, బాపట్లలో బి.యస్.సి. పూర్తిచేసి, కొంతకాలం ఏలూరులో పనిచేశారు. సినిమాలలో నటించాలనే ఉత్సాహంతో మద్రాసు చేరి ప్రయత్నించారు.
హీరోగా రంగులరాట్నం (1966) చిత్రంతో మొదలుపెట్టి, అప్పటినుండి సహనాయకుడిగా, నాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ప్రధానంగా కామెడీ, భావోద్వేగ పాత్రల ద్వారా చంద్ర మోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటారు.