Newyork, Nov 11: ప్రపంచంలోనే తొలిసారిగా పూర్తి కన్ను మార్పిడి (Whole-Eye Transplant) శస్త్రచికిత్సను అమెరికా (America) సర్జన్లు పూర్తి చేశారు. ఈ చికిత్స జరిగిన వ్యక్తికి తిరిగి చూపు వస్తుందని కచ్చితంగా చెప్పలేకపోయినా..ఈ చికిత్సను వైద్య రంగ చరిత్రలో కీలక మైలురాయిగా పేర్కొంటున్నారు. ఈ శస్త్రచికిత్సలో దాత నుంచి సేకరించిన ఎడమ కన్నును అరాన్ జేమ్స్ అనే లైన్ వర్కర్ కు అమర్చారు. గతంలో ఇలా పూర్తి కంటి మార్పిడి చికిత్స జంతువుల్లో కొంతవరకు విజయవంతమై పాక్షికంగా చూపు వచ్చింది. జేమ్స్ కు అమర్చిన కన్ను ఆరోగ్యంగా ఉందని వైద్యులు తెలిపారు.
A team of New York surgeons has performed the world’s first whole-eye transplant on a human, a breakthrough that could change vision treatments https://t.co/lOAi43ZwWh https://t.co/lOAi43ZwWh
— The Wall Street Journal (@WSJ) November 10, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)