అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ట్రంప్ విక్టరీ ర్యాలీ (Trump pre oath rally) నిర్వహించారు. వాషింగ్టన్ డీసీ (Washington DC)లో ఆదివారం ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ పేరుతో నిర్వహించిన ర్యాలీలో ట్రంప్ మద్దతుదారులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ ర్యాలీలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ఐకానిక్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ర్యాలీ ముగింపు సందర్భంగా విలేజ్ డిస్కో గ్రూప్ ప్రత్యేక ప్రదర్శన ఇచ్చింది. అదే సమయంలో స్టేజ్‌పై ఉన్న ట్రంప్.. మ్యూజిక్‌కు తగ్గట్లుగా తన ఐకానిక్ స్టెప్పులతో మద్దతుదారులను ఉత్సాహపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
కాగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. రెండోసారి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఓ నేరస్థుడిగా ముద్రపడిన తొలి అమెరికా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. 78 ఏళ్ల వయసులో అగ్రరాజ్యాధినేతగా మరోసారి బాధ్యతలు స్వీకరిస్తున్నారు.
Donald Trump Dance Video
🎤 The original members of the Y.M.C.A. take the stage after Donald Trump’s speech, closing out the event with an unforgettable performance. 🎤 #ReformDaily #TrumpEvent #YMCA #MusicAndPolitics #News pic.twitter.com/cOvOTUfOnN
— The Reform Daily (@ReformDaily_) January 19, 2025
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)