Gurucharan Passes Away: టాలీవుడ్ లో విషాదం.. ‘ముద్దబంతి నవ్వులో మూగబాసలు..’ వంటి హిట్‌ సాంగ్స్ అందించిన పాటల రచయిత గురు చరణ్‌ ఇకలేరు

టాలీవుడ్ కు చెందిన నిన్నటి తరం ప్రముఖ గీత రచయిత గురుచరణ్‌ (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు.

Gurucharan Passes Away (Credits: X)

Hyderabad, Sep 13: టాలీవుడ్ (Tollywood) కు చెందిన నిన్నటి తరం ప్రముఖ గీత రచయిత గురుచరణ్‌ (Gurucharan Passes Away) (77) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున హైదరాబాద్‌ లో ఆయన తుది శ్వాస విడిచారు. గురుచరణ్‌ అసలు పేరు మానాపురపు రాజేంద్రప్రసాద్‌. అలనాటి ప్రముఖనటి ఎం.ఆర్‌. తిలకం, అప్పటి ప్రముఖ దర్శకుడు మానాపురం అప్పారావుల కుమారుడే గురుచరణ్‌. ప్రఖ్యాత గేయ రచయిత ఆచార్య ఆత్రేయ దగ్గర కొన్నాళ్లు శిష్యరికం చేసిన గురుచరణ్  ఆ తర్వాత గీత రచన మొదలు పెట్టారు. తెలుగులో రెండు వందలకు పైగా పాటలు రాశారు.

వెండితెర‌పై హిట్ కొట్టిన చిన్న సినిమా ఓటీటీలోకి వ‌చ్చేసింది! నిహారిక కొణిదెల నిర్మించిన క‌మిటీ కుర్రోళ్లు ఎక్కడ చూడొచ్చో తెలుసా? ఈ సినిమా చూస్తే మీ బాల్యం గుర్తుకురాకుండా ఉండ‌దు

ఎన్నో అద్భుత గీతాలు

ప్రముఖ నటుడు మోహన్‌ బాబుతో గురుచరణ్ కు మంచి సాన్నిహిత్యం ఉండేది. ఆయన సినిమాలకు గురుచరణ్ ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు. ముఖ్యంగా ‘ముద్దబంతి నవ్వులో మూగబాసలు..’, ‘కుంతీకుమారి తన జోరుజారి’, ‘బోయవాని వేటుకు గాయపడిన కోయిలా..’ పాటలు ఇప్పటికీ శ్రోతలను అలరిస్తూనే ఉన్నాయి. గురుచరణ్‌ మరణం తెలుగు చిత్రపరిశ్రమకు నిజంగా తీరని లోటని మోహన్ బాబు అన్నారు.

సోషల్ మీడియాని ఊపేస్తున్న దేవర, ప్రమోషన్స్ బిజీలో జూనియర్ ఎన్‌టీఆర్, ఈ రోజు విడుదల కానున్న ట్రైలర్ 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement