Top Telugu Movies: ఇటీవల కాలంలో తెలుగు సినిమా స్థాయిని పెంచిన కొన్ని సినిమాలు.
దీంతో బాలీవుడ్ కూడా తెలుగు సినిమాపై పడింది. ఇక్కడి కథలను రీమేక్..
భారతీయ సినీ మార్కెట్లో బాలీవుడ్ తర్వాత రెండో అతిపెద్ద సినిమా ఇండస్ట్రీ టాలీవుడ్ (Tollywood) గా పిలువబడే తెలుగు సినిమా ఇండస్ట్రీ (Telugu Film Industry). నార్త్ ఇండియాలో బాలీవుడ్ (Bollywood Movies) సినిమాలకు విపరీతమైన క్రేజ్. అక్కడివారు దక్షిణ భారతాన్ని (South India) ఒకేరకంగా చూస్తారు. సౌత్ లేదా మద్రాసీగా చెప్తారు.
తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం ఏ భాషలో సినిమా విడుదలైనా సౌత్ ఇండియన్ సినిమాగానే (South Cinema) ముద్ర వేస్తారు. ఇదివరకు సౌత్ నుంచి వచ్చిన సినిమా అంటే వారికి ఒకవిధమైన చిన్న చూపు ఉండేది.
కానీ, ఇటీవల కాలంలో సౌత్ ఇండియన్ సినిమా ఖండంతారాలను దాటి, అనేక భాషల్లో విడుదలవుతూ అఖండ విజయాలు సాధిస్తుండటంతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దీంతో వారి చూపు దక్షిణం వైపు పడింది. ఇక్కడ సూపర్ హిట్ అయిన సినిమాలు హిందీలో రీమేక్ అవుతూ కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అవుతున్నాయి.
దీనికంతటికీ కారణం తెలుగు సినిమానే, తెలుగులో వచ్చిన కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశాయి. బాలీవుడ్ కు దీటుగా ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధిస్తూ తెలుగు సినిమా సత్తా ఏంటో ఈ సినిమాలు నిరూపించాయి.
మంచి ప్రేక్షకాదరణతో తెలుగు సినిమా అంటే గొప్పగా చెప్పుకునేలా చేసిన కొన్ని చిత్రాలు (Top Telugu Movies):
బాహుబలి 1& 2
నో డౌట్! బాహుబలి సినిమా భారతీయ సినిమా ఇండస్ట్రీకే ఒక బాహుబలిగా, అందరూ గర్వంగా చెప్పుకునే సినిమాగా నిలిచింది. ఎస్. ఎస్ రాజమౌళి టేకింగ్, ప్రభాస్, రానా, అనుష్కలా పెర్ఫార్మెన్స్ సినిమాను ఒక రేంజ్ కు తీసుకెళ్లాయి. ఈ సినిమా దెబ్బతో ప్రభాస్ ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ గా స్టార్ డమ్ ను సంపాందించాడు.
అర్జున్ రెడ్డి
ఈ సినిమా అప్పటివరకూ ఉన్న తెలుగు సినిమా మూస ధోరణులను బ్రేక్ చేస్తూ ఒక గేమ్ చేంజర్ గా నిలిచింది. సందీప్ వంగ కథ, కథనం, అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండ నటనకు జనాలు ఫిదా అయ్యారు. భాషతో సంబంధం లేకుండా ప్రతీ స్టేట్ లో ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ అమాంతంగా ఓ స్టార్ హీరో అయిపోయాడు. యూత్ లో అర్జున్ రెడ్డి ఒక వైబ్రేషన్, ఒక సరికొత్త స్వాగ్ (Swag)ను క్రియేట్ చేశాడు. ఈ మూవీ హిందీలో కబీర్ సింగ్, తమిళ్ లో ఆదిత్య వర్మగా రీమేక్ అవుతుంది.
మహానటి
అలనాటి మేటి నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. మహానటి సావిత్రిగా హీరోయిన్ కీర్తి సురేష్ నిజంగానే ఓ మహానటిగా ఈ చిత్రంతో కీర్తి గడించింది. సావిత్రి భర్తగా దుల్కర్ సల్మాన్ కూడా అదే స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాలో జర్నలిస్టులుగా విజయ్ దేవరకొండ - సమంతల జోడి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ సినిమా కథ, కథనం, టేకింగ్ చాలా గొప్పగా ఉంది.
మహర్షి
రైతులు పడే బాధల గురించి ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మహర్షి' చిత్రం వాటన్నింటికి ఒక మెట్టు ఎక్కువే అని చెప్పాలి. రైతుల కష్టాలను ఎంతో అర్థవంతంగా, తెలివిగా, కమర్షియల్ వాల్యూస్ ముఖ్యంగా మహేశ్ సూపర్ స్టార్ డమ్ కూడా ఎక్కడా తగ్గకుండా దర్శకుడు వంశీ పైడిపల్లి చాలా స్మార్ట్ గా ఈ సినిమా తెరకెక్కించాడు.
మహేశ్ తన ప్రతీ సినిమాలో ఏదో ఒక మెసేజ్ ఉండేలా చూసుకుంటున్నాడు. ఊరి దత్తత పేరుతో 'శ్రీమంతుడు', ప్రజల బాధ్యత- ప్రభుత్వ జవాబుదారీతనంతో వచ్చిన 'భరత్ అనే నేను' లాంటి సినిమాలు కూడా తెలుగు సినిమా స్థాయిని పెంచేవే.
ఘాజీ
1971 ఇండియా- పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో వచ్చిన ఘాజీ సినిమా తెరకెక్కించిన విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. లెఫ్టినెంట్ కమాండర్ గా రానా దగ్గుబాటి, శరణార్థులకు వైద్యం అందించే వైద్యురాలిగా తాప్సీ ఈ సినిమాలో నటించారు.
పాకిస్థాన్ రహస్యంగా ఘాజీ అనే అత్యంత అధునాతనమైన టెక్నాలజీ కలిగిన జలాంతర్గామిని భారత్ పై దాడులకు పంపించినపుడు, భారత ఇంటెలిజెన్స్ దానిని పసిగట్టి దానిని అంతే రహస్యంగా జలసమాధి చేసే ఆనాటి విజయ ఘట్టాలను ఈ సినిమాలో తెరకెక్కించిన ఎంతో స్పూర్తినిస్తుంది.
ఇవేకాకుండా, రంగస్థలం, 1నేనొక్కడినే, మనం, ఊపిరి, కంచె, ఆ! లాంటి సినిమాలు తెలుగు సినిమా అంటే ఇదీ అని అందరూ గొప్పగా చెప్పుకునేలా చేశాయి.