Kannappa Movie Update: ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కన్నప్పలో నటించిన ప్ర‌భాస్‌,మోహ‌న్‌లాల్, షాకింగ్ విషయాలను వెల్లడించిన మంచు విష్ణు

మంచు విష్ణు హీరోగా వస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ 'కన్నప్ప'. ముఖేశ్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో మంచు విష్ణు కథానాయకుడిగా (Vishnu Manchu) సుమారు రూ. 140కోట్ల భారీ బడ్జెట్‌తో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు

Vishnu Manchu reveals Prabhas and Mohanlal did not take any remuneration for their roles in the Kannappa's movie (photo-X/Vishnu)

మంచు విష్ణు హీరోగా వస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ 'కన్నప్ప'. ముఖేశ్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో మంచు విష్ణు కథానాయకుడిగా (Vishnu Manchu) సుమారు రూ. 140కోట్ల భారీ బడ్జెట్‌తో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 25న వ‌ర‌ల్డ్‌వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మేక‌ర్స్ ప్ర‌స్తుతం ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల‌ను జోరుగా నిర్వ‌హిస్తున్నారు.

ఇక 'కన్నప్ప'లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మోహ‌న్‌లాల్‌ తో (Prabhas and Mohanlal) పాటు త‌మిళ‌, క‌న్న‌డ, హిందీ ఇండ‌స్ట్రీల‌కు చెందిన ప‌లువురు ప్ర‌ముఖ న‌టులు అతిథి పాత్రల‌లో నటిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే ప్రభాస్, మోహ‌న్‌లాల్ స‌హా ఇత‌ర న‌టీన‌టుల‌ ఫస్ట్ లుక్ ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ రుద్రుడిగా కనిపించనున్నారు.

కన్నప్ప నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ఇదిగో, రుద్ర పాత్రలో కనిపించనున్న డార్లింగ్, ఏప్రిల్ 25న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల

ఈ సినిమాకు (Kannappa's movie)సంబంధించి ప్రభాస్, మోహ‌న్‌లాల్‌ తీసుకున్న పారితోషికంపై ఆసక్తికర విషయాలు తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఓ ఇంటర్వ్యూలో హీరో మంచు విష్ణు మాట్లాడుతూ ప్రభాస్ ఈ సినిమాకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని తెలిపారు. అలాగే మలయాళ మెగాస్టార్ మోహన్‌లాల్ కూడా ఈ మూవీకి ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని వెల్లడించారు. తన తండ్రి మోహన్ బాబుపై ఉన్న అభిమానంతో వారు ఈ ప్రాజెక్ట్ లో భాగమైనట్లు విష్ణు చెప్పుకొచ్చారు.

కన్నప్ప విషయానికి వస్తే, ఇటీవల విడుదలైన కొన్ని పాటల కారణంగా ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రం ఏప్రిల్ 25, 2025న థియేటర్లలో విడుదల కానుంది.మోహన్ లాల్ కెరీర్ గురించి చెప్పాలంటే, తన చివరి విడుదల బారోజ్ తర్వాత, ఆ నటుడు తన తదుపరి చిత్రం L2: ఎంపురాన్ కోసం సిద్ధమవుతున్నాడు. మరోవైపు, ప్రభాస్ ది రాజా సాబ్, స్పిరిట్, ఫౌజీ, సాలార్ 2 వంటి అనేక ప్రాజెక్టులను వరుసలో ఉంచాడు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement