
Kadapa, Mar 7: వివేకా హత్య కేసు ప్రత్యక్ష సాక్షి వాచ్‌మెన్ రంగయ్య మృతిపై కడప ఎస్పీ అశోక్ కుమార్ కీలక ప్రకటన చేశారు. రంగయ్యది అత్యంత అనుమానాస్పద మృతిగా పరిగణిస్తున్నాం. ఇప్పటికి ప్రధాన సాక్షులు ఐదుగురు చనిపోయారు. ఒకే పరిణామ క్రమంలో జరుగుతున్న ఈ మరణాలపై అన్ని కోణాల్లో సైంటిఫిక్ ఎవిడెన్స్‌తో దర్యాప్తు కొనసాగుతుంది. సాక్షుల మరణంపై నిపుణుల బృందంతో విచారణను మొదలు పెడుతున్నామని తెలిపారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న వాచ్‌మన్ రంగయ్య .. కడప రిమ్స్ ఆస్పత్రిలో బుధవారం రాత్రి మృతి చెందాడు. అయితే ఆయన మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయంటూ సుశీలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. వివేకా హత్య కేసులో ఏకైక ప్రత్యక్ష సాక్షిరంగయ్యే.
రంగయ్మ భార్య మాట్లాడుతూ.. నా భర్తను 2024 వరకూ పోలీసులు బాగానే చూసుకున్నారు. ఆ తర్వాత నా భర్తను హింసించారు. ఆయన కీళ్లు విరగొట్టారు. కొట్టి కొట్టి ఇలా చనిపోయేలా చేశారు. గత మూడు నెలలుగా ఆయన ఆరోగ్యం బాగాలేకపోయినా పట్టించుకోలేదు. ఢిల్లీ నుంచి అన్నీ ప్రాంతాలు తిప్పారు. ఇప్పుడు మాకేం సంబంధం అంటున్నారు. రంగయ్య మృతికి సీబీఐ, పోలీసులే కారణం’’ అని ఆరోపించారు.
Kadapa SP Ashok Kumar's statement on the death of watchman Rangaiah
వివేకా హత్య కేసు ప్రత్యక్ష సాక్షి వాచ్ మెన్ రంగయ్య మృతిపై కడప ఎస్పీ అశోక్ కుమార్ ప్రకటన.
రంగయ్యది అత్యంత అనుమానాస్పద మృతిగా పరిగణిస్తున్నాం. ఇప్పటికి ప్రధాన సాక్షులు ఐదుగురు చనిపోయారు. ఒకే పరిణామ క్రమంలో జరుగుతున్న ఈ మరణాలపై అన్ని కోణాల్లో సైంటిఫిక్ ఎవిడెన్స్‌తో దర్యాప్తు… pic.twitter.com/BxaIGiGCgp
— Telugu Desam Party (@JaiTDP) March 7, 2025
Watchman Rangaiah Wife Statement
దీనిపై గురువారం రాత్రి తన కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ విలేకర్లతో మాట్లాడారు.రంగయ్య మృతి కేసు దర్యాప్తు బాధ్యతలను ఆర్కే వ్యాలీ సీఐ ఉలసయ్యకు అప్పగించాం. పోస్టుమార్టం వివరాలు వస్తే రంగయ్య మృతికి కారణాలు తెలుస్తాయి’ అని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.ఇక సుశీలమ్మ ఆరోపణలపై సీఐ ఉలసయ్య స్పందించారు. ‘‘రంగన్న మృతిపై ఆయన భార్య సుశీలమ్మ పిర్యాదు చేసింది. అనుమానాస్పద కేసు నమోదు చేసి విచారిస్తున్నాం. మృతికి కారణం ఏమిటో పోస్ట్ మార్టం నివేదికలో తెలుస్తుంది’’ అని తెలిపారు.