Manchu Vishnu: ‘కన్నప్ప’ షూటింగ్‌లో గాయపడ్డ మంచు విష్ణు.. న్యూజిలాండ్ లో విష్ణుపైకి దూసుకొచ్చిన డ్రోన్!

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప టీం ప్రస్తుతం న్యూజిలాండ్‌ లో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడే షూటింగ్‌ ను శరవేగంగా జరుపుతున్నారు. అయితే తాజాగా కన్నప్ప టీం నుంచి ఓ వార్త బయటకు వచ్చింది.

Manchu Vishnu (Photo-Twitter)

Hyderabad, Oct 30: టాలీవుడ్ హీరో మంచు విష్ణు (Tollywood Hero Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa) టీం ప్రస్తుతం న్యూజిలాండ్‌ లో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడే షూటింగ్‌ ను శరవేగంగా జరుపుతున్నారు. అయితే తాజాగా కన్నప్ప టీం నుంచి ఓ వార్త బయటకు వచ్చింది. కన్నప్ప షూటింగ్‌ లో మంచు విష్ణు గాయపడ్డాడని, దీంతో సినిమా షూటింగ్‌ ను (Shooting) తాత్కాలికంగా ఆపేశారని టాక్ వినిపిస్తోంది. యాక్షన్ సన్నివేశాలను డ్రోన్ సాయంతో చిత్రీకరిస్తుండగా... అదుపుతప్పిన డ్రోన్ మంచు విష్ణు మీదకు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనతో మంచు విష్ణు చేతికి గాయాలయ్యాయని సమాచారం. దీంతో షూటింగ్‌ను క్యాన్సిల్ చేసి మంచు విష్ణుకి చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. భయపడాల్సినంత పెద్దగా ప్రమాదం ఏమీ జరగలేదని సమాచారం.

Matthew Perry Dies: బాత్ రూంలో గుండెపోటుతో మృతి చెందిన ప్రముఖ నటుడు, తన ఇంట్లోనే అచేతనంగా కనిపించిన ఫ్రెండ్స్ సిరీస్ స్టార్ మాథ్యూ పెర్రీ

సినిమాలో సూపర్ స్టార్స్

బుల్లితెరపై మహాభారతం సీరియల్‌ ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ కన్నప్ప చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శివ భక్తుడైన కన్నప్ప కథను ఆధారంగా తీసుకుని చేస్తున్న ఈ మూవీలో కన్నప్పగా మంచు విష్ణు కనిపించబోతున్నారు. పాన్ ఇండియన్ హీరో ప్రభాస్, మాలీవుడ్ నుంచి మోహన్ లాల్, శాండల్ వుడ్ నుంచి శివ రాజ్ కుమార్ వంటి వారు కన్నప్పలో భాగమైన సంగతి తెలిసిందే.

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, విలన్‌ రోల్స్‌లో మెప్పించిన సీనియర్ నటుడు కన్నుమూత, నివాళులు అర్పిస్తున్న మలయాళీ ఇండస్ట్రీ

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement