Matthew Perry Dies

సినీ పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. హాలీవుడ్ బుల్లితెర నటుడు, నిర్మాత మాథ్యూ పెర్రీ కన్నుమూశారు. 54 ఏండ్ల వయసున్న ఆయన శనివారం సాయంత్రం లాస్ ఏంజిల్స్ లోని తన సొంత ఇంట్లోనే అచేతనంగా కనిపించారు. ఈ విషయాన్ని లాస్ ఏంజిల్స్ టైమ్స్ అధికారికంగా వెల్లడించింది.

మాథ్యూ ఇంట్లో పడి ఉన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకున్నారు. ఆయను పరిశీలించారు. అయితే, తను అప్పటికే చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు.మ్యాథ్యూ పెర్రీ పడిపోయి ఉన్న ప్రదేశంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని పోలీసులు తెలిపారు.మాథ్యూ మృతికి గుండె పోటు కారణం అని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, విలన్‌ రోల్స్‌లో మెప్పించిన సీనియర్ నటుడు కన్నుమూత, నివాళులు అర్పిస్తున్న మలయాళీ ఇండస్ట్రీ

మాథ్యూ పెర్రీ ‘ఫ్రెండ్స్’ సిరీస్ తో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1994 నుంచి 2004 వరకు 10 సీజన్ల పాటు ప్రసారం అయ్యింది. ఈ సిరీస్ లో మాథ్యూ చాండ్లర్ అనే పాత్రను పోషించారు. ఈ పాత్రతో తనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ సిరీస్ లో అద్భుత నటనకు గాను ఆయనకు రెండుసార్లు ప్రైమ్‌టైమ్ ఎమ్మీ నామినేషన్‌ను అందుకున్నారు.

ప్రెండ్స్ సిరీస్ మాత్రమే కాదు, ‘స్టూడియో 60 ఆన్ ది సన్‌సెట్ స్ట్రిప్', 'గో ఆన్', 'ది ఆడ్ కపుల్' లాంటి టీవీ షోలతో బాగా పాపులర్ అయ్యారు. 'ది వెస్ట్ వింగ్' సిరీస్‌లో జో క్విన్సీ పాత్రకు గానూ అత్యుత్తమ గెస్ట్ యాక్టర్ గా 2003, 2004లో రెండు ఎమ్మీ నామినేషన్లు పొందారు.