ANR National Awards 2018 - 2019: ఘనంగా ఏఎన్నార్ జాతీయ పురస్కార ప్రదానోత్సవం, దివంగత నటి శ్రీదేవి మరియు సీనియర్ నటి రేఖలకు పురస్కారాలు, ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి

ఈ వేడుకకు అక్కినేని ఫ్యామిలీతో పాటు, టాలీవుడ్ హీరోలు విజయ్ దేవరకొండ, అడవి శేష్, రాహుల్ రవీంద్రన్ అలాగే మంచు లక్ష్మీ, నిహారిక, తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు....

ANR National Awards 2018 - 2019 Event at Hyderabad | Photo Credits : Annapurna Studios

అక్కినేని ఇంటర్నేషన్ ఫౌండేషన్ ప్రతీ ఏడాది ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఏఎన్నార్ జాతీయ పురస్కార ప్రదానోత్సవం హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. 2018-19 సంవత్సరానికి గానూ ఉత్తమ నటులకు అవార్డులు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ( ANR National Awards 2018 - 2019) మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా, టి. సుబ్బిరామి రెడ్డి ప్రత్యేక అతిథిగా హజరయ్యారు.

2018 ఏడాదికి గాను, దివంగత నటి శ్రీదేవిని ఏఎన్నార్ జాతీయ పురస్కారంతో గౌరవించారు. ఆమె భర్త బోనీ కపూర్ ఈ అవార్డును స్వీకరించారు. ఇక 2019 గాను, సీనియర్ బాలీవుడ్ నటి రేఖకు ఈ అవార్డుతో సత్కరించారు. ఆమె స్వయంగా ఈ వేడుకకు హాజరై అవార్డును స్వీకరించారు.

ANR National Awards 2018 - 2019 LIVE:

ఈ వేడుకకు అక్కినేని ఫ్యామిలీతో పాటు, టాలీవుడ్ హీరోలు విజయ్ దేవరకొండ, అడవి శేష్, రాహుల్ రవీంద్రన్ అలాగే మంచు లక్ష్మీ, నిహారిక, తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ ఏఎన్నార్ జాతీయ పురస్కార ప్రదానోత్సవం సందర్భంగా అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా (AISFM) నుండి ఉత్తమ ప్రతిభ కనబర్చిన, ఉత్తీర్ణత పొందిన విద్యార్థులకు అవార్డు, డిగ్రీ పట్టాలు ప్రముఖుల చేతుల మీదుగా అందజేస్తారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement