Jabardasth Comedian Arrest: పెళ్లి పేరుతో కోరికను తీర్చుకున్న జబర్దస్త్‌ కమెడియన్‌, మోసపోయానంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన యువతి, నవసందీప్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసినందుకు జబర్దస్త్‌ కమెడియన్‌ నవసందీప్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. లవ్ పేరుతో నన్ను మోసం చేశాడన్న యువతి ఫిర్యాదు మేరకు నవసందీప్‌ను మధురానగర్‌లో అరెస్ట్‌ చేశారు.

Nava Sandeep (Credits: X)

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసినందుకు జబర్దస్త్‌ కమెడియన్‌ నవసందీప్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. లవ్ పేరుతో నన్ను మోసం చేశాడన్న యువతి ఫిర్యాదు మేరకు నవసందీప్‌ను మధురానగర్‌లో అరెస్ట్‌ చేశారు. కాగా ఇటీవల ఓ యువతి.. తనను నవసందీప్‌ ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసులు నటుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

ప్రేమ పేరుతో మోసం.. బాధితురాలిని పలుమార్లు వశపరుచుకున్న ‘జబర్దస్త్’ నటుడు సందీప్‌.. పెళ్లి ఊసెత్తకపోవడంతో యువతి ఫిర్యాదు.. కేసు

పోలీసుల వివరాల ప్రకారం.. జబర్దస్త్‌ నటుడు నవసందీప్‌ 2018లో ఓ యువతికి ప్రేమకబుర్లు చెప్పి దగ్గరయ్యాడు. నిత్యం వాట్సాప్‌ చాటింగ్‌ చేసేవాడు. ఆమెను ఊరి నుంచి హైదరాబాద్‌కు రప్పించాడు. షేక్‌పేటలోని ఓ హాస్టల్‌లో ఆ యువతి నాలుగేళ్లుగా ఉంటోంది. ఈ క్రమంలో త్వరలో పెండ్లి చేసుకుంటానని నమ్మించి తన కోరిక తీర్చుకున్నాడు. తర్వాత ఆమె పెళ్లి ప్రస్తావన తేగానే ముఖం చాటేశాడు. తాను వేరొకరిని పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు నవసందీప్‌ను అరెస్ట్‌ చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement