Hyderabad, Aug 21: ఈటీవీలో (ETV) వచ్చే కామెడీ షో ‘జబర్దస్ట్’ (Jabardasth) ద్వారా గుర్తింపు సంపాదించుకున్న నటుడు, గాయకుడు నవ సందీప్ (Actor Sandeep) పై హైదరాబాద్ (Hyderabad) మధురానగర్‌లోని పోలీస్ స్టేషన్‌లో (Police Station) కేసు నమోదైంది. ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేశాడంటూ ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పోలీసుల కథనం ప్రకారం.. నవ సందీప్ కు 2018లో ఓ యువతితో పరిచయం అయింది. అది మరింత ముదిరింది. విషయం తెలియడంతో యువతి తల్లిదండ్రులు ఆమెను దూరం పెట్టారు. సందీప్ భరోసాతో ఇంటి నుంచి వచ్చిన యువతి షేక్ పేటలోని ఆల్ హమారా కాలనీలోని ఓ హాస్టల్‌లో ఉంటోంది.
ప్రేమ పేరుతో మోసం చేసిన జబర్దస్త్ కమెడియన్.. కేసు నమోదు | Jabardasth Actor Nava Sandeep | hmtv#hmtvnews #hmtv pic.twitter.com/3MBy2mi3zZ
— hmtv News (@hmtvnewslive) August 20, 2023
వశపరుచుకొని.. ముఖం చాటేసి
ఈ క్రమంలో ఆమెను పలుమార్లు వశపరుచుకున్నసందీప్ పెళ్లి విషయాన్ని మాత్రం దాటవేస్తూ వస్తున్నాడు. దీంతో మనస్తాపం చెందిన యువతి తొలుత గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అది తమ పరిధి కాకపోవడంతో అక్కడి పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. మధురానగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.