Sri Reddy, Sudigali Sudheer: శ్రీరెడ్డి ఒడిలో సుడిగాలి సుధీర్, వామ్మో ఇద్దరు తెగ రెచ్చిపోయారుగా, ఎప్పుడో, ఎక్కడో తెలిస్తే షాకే..

బుల్లితెర సంచలనం సుడిగాలి సుధీర్.. ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో.. ఇక రచ్చ అయితే మామూలుగా ఉండదు. అంతే కాదు వీరితో పాటు బిగ్ బాస్ భామ ప్రియ కూడా చేరింది. వీరిద్దరి మధ్యన సుడిగాలి సుధీర్ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నాడు.

Image: Twitter

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ శ్రీరెడ్డి.. బుల్లితెర సంచలనం సుడిగాలి సుధీర్.. ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో.. ఇక రచ్చ అయితే మామూలుగా ఉండదు. అంతే కాదు వీరితో పాటు బిగ్ బాస్ భామ ప్రియ కూడా చేరింది. వీరిద్దరి మధ్యన సుడిగాలి సుధీర్ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నాడు. అయితే ఈ ఫోటో చూడగానే అందరికీ అనుమానాలు రావడం ఖాయం. సుడిగాలి సుధీర్ ఒక రకంగా చెప్పాలంటే బుల్లితెర సూపర్ స్టార్.. ఏ షో చేసినా టాప్ రేటింగ్‌తో దూసుకుని పోతుంది. ఇక జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలతో పాటు, సినిమాల్లోకూడా మనోడు ఇరగదీస్తున్నాడు. సుధీర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అతడికి తెలుగు రాష్ట్రాల్లో వీరాభిమానులు ఉన్నారు. అంతేకాదు సుధీర్ పవన్ కళ్యాణ్ కు ఒక రకంగా భక్తుడు అనే చెప్పాలి. అలాంటి సుధీర్ నిత్యం పవన్ కళ్యాణ్ ను బండబూతులు తిట్టే శ్రీరెడ్డిని ఎందుకు కలిశాడనేది హాట్ టాపిక్ గా మారింది.

ఇదిలా ఉంటే శ్రీరెడ్డి అయితే చెన్నైలో ఉంటుంది. ఆ మధ్య హైదరాబాద్ వచ్చి పనులన్నీ చక్కబెట్టేసుకుని మళ్లీ సైలెంట్‌గా చెన్నైకి చెక్కేసింది. కాస్త అనారోగ్య కారణాలతో పెద్ద యాక్టివ్‌గా ఉండటంతో లేదు కానీ.. సమంత, మా ఎలక్షన్స్ ఇష్యూలో లైవ్‌లలోకి వచ్చి బాంబ్‌లు పేల్చింది. అయితే శ్రీరెడ్డి, సుడిగాలి సుధీర్ ఫొటో ఎక్కడిది? ఈ ఫొటో ఇప్పుడు వైరల్ ఎందుకు అవుతుందన్న విషయానికి వస్తే.. ఇది అమెరికాలో జరిగిన ఓ ప్రైవేట్ ఈవెంట్‌కి హాజరైనప్పటి ఫొటో అని . అక్కడికి సుధీర్, శ్రీరెడ్డి, ప్రియ హాజరైనట్టు గుర్తని చెప్తోంది శ్రీరెడ్డి. ఆ సందర్భంలోనే ముగ్గురు కలిసి కెమెరాలకు ఫోజులు ఇచ్చామని.. దాదాపు ఈ ఫొటో దిగి మూడు నాలుగేళ్లు కావొచ్చని అంటోంది శ్రీరెడ్డి. ఏది ఏమైనా సుధీర్ మాత్రం శ్రీరెడ్డి ఒడికి దగ్గరగా అలా ఫోజులివ్వడం ఒక రకంగా సంచలనమే..