Telangana: తెలంగాణలోని 10 యూనివర్శిటీలకు కొత్త వైస్ ఛాన్సలర్లను నియమించిన రాష్ట్ర సర్కార్, ఆమోదించిన రాష్ట్ర గవర్నర్, వివరాలు ఇలా ఉన్నాయి

తెలంగాణ రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ లను ప్రభుత్వం నియమించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు, యూజిసి నిబంధనలకు అనుగుణంగా, రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ లను...

Govt of Telangana | File Photo

Hyderabad, May 22: తెలంగాణ రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ లను ప్రభుత్వం నియమించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలు, యూజిసి నిబంధనలకు అనుగుణంగా, రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ లను ఎంపిక చేసి నియామక ప్రక్రియను చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అనంతరం నూతనంగా నియమించిన వీసీల వివరాలను గవర్నర్ ఆమోదం కోసం పంపగా, రాష్ట్ర గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ ఆమోదం వీసీల నియామకానికి  తెలిపారు.

కరోనా నేపథ్యంలో వీసీల నియామకంలో కొంత ఆలస్యం జరిగిందనీ, అయినప్పటికీ నిబంధనల ప్రకారం అభ్యర్థుల ఎంపిక కసరత్తు చేసి నియామకం పూర్తిచేసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. రాష్ట్రంలో వివిధ యూనివర్శిటీలకు కొత్తగా నియమించిన వైస్ ఛాన్సలర్ ల వివరాలు ఇలా ఉన్నాయి.

ఉస్మానియా యూనివర్సిటీ, (హైదరాబాద్) వీసీ గా ప్రొ. డి. రవీందర్ యాదవ్ (బీసీ).,

కాకతీయ యూనివర్సిటీ (వరంగల్) వీసీ గా ప్రో. టి. రమేష్ (బీసీ).,

తెలంగాణ యూనివర్సిటీ, (నిజామాబాద్) వీసీ గా ప్రో. డి. రవీందర్ (ఓసి).

డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (హైదరాబాద్) వీసీ గా ప్రొ. సీతారామారావు (ఓసి).,

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ (హైదరాబాద్) వీసీ గా ప్రొ. టి. కిషన్ రావు (ఓసి).,

పాలమూరు యూనివర్సిటీ (మహబూబ్ నగర్) వీసీ గా ప్రొ. లక్ష్మీకాంత్ రాథోడ్ (ఎస్టీ).

మహాత్మాగాంధీ యూనివర్సిటీ, (నల్లగొండ) వీసీ గా ప్రో. సిహెచ్. గోపాల్ రెడ్డి,.

జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (హైదరాబాద్) వీసీ గా ప్రొ. కట్టా నర్సింహా రెడ్డి (ఓసి),

శాతవాహన యూనివర్సిటీ, (కరీంనగర్) వీసీ గా ప్రో. మల్లేశం (ఎస్సీ).

జవహర్ లాల్ నెహ్రు ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (హైదరాబాద్) వీసీగా శ్రీమతి కవిత దర్యాని (ఓసి).

గవర్నర్ ఆమోదం మేరకు ఆయా యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్ ల నియామకం పూర్తిచేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement