Telangana TET: ఉపాధ్యాయ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు టెట్... జూన్‌ లో ఓసారి, డిసెంబర్‌ లో మరోసారి నిర్వహణ.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

ఏడాదికి రెండు సార్లు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ శనివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

exam students

Hyderabad, July 7: ఏడాదికి రెండు సార్లు టెట్ (TET) (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు (Telangana Government) నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ శనివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి ఏటా జూన్ లో ఓసారి, డిసెంబర్ లో మరోసారి టెట్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఒక అభ్యర్థి ఎన్నిసార్లు అయినా టెట్ పరీక్ష రాయవచ్చునని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టెట్‌ లో ఉత్తీర్ణత సాధించిన వారికే డీఎస్సీ రాయడానికి అవకాశం ఉంటుంది. టెట్ మార్కులకు డీఎస్సీలో వెయిటేజీ కూడా ఇస్తారు. గతంలో, నేషనల్‌‌‌ కౌన్సిల్‌‌‌ ఫర్‌‌‌ టీచర్‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌ (ఎన్సీటీఈ) ప్రతి సంవత్సరం రెండుసార్లు టెట్‌‌‌ నిర్వహించాలని రాష్ట్రాలను ఆదేశించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం టెట్ గడువును జీవితకాలానికి పెంచింది. దీంతో ఒక్కసారి క్వాలిఫై అయితే, మరోసారి రాయాల్సిన అవసరం లేదు.

కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీ కొట్టిన బైక్‌, అన్న మృతి చెందగా చెల్లెలికి గాయాలు

గతంలో ఇలా..

గతంలో ఏటా ఒక్కసారి మాత్రమే టెట్‌ నిర్వహిస్తామని 2015లో అప్పటి కేసీఆర్ సర్కారు జీఓ 36 జారీ చేసినా ఇప్పటి వరకు ఐదుసార్లు మాత్రమే పరీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2016, 2017లో టెట్‌ నిర్వహించారు. అనంతరం 2018 నుంచి 2021 వరకు టెట్‌ ఊసే లేదు. మళ్లీ 2022, 2023లో వరుసగా టెట్ నిర్వహించారు.

వీడియో ఇదిగో, డిపో ఎదురుగా లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, అద్దాల నుంచి ముందుకు దూసుకొచ్చి కంటైనర్ కిందపడి డ్రైవర్ మృతి

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

Advertisement
Advertisement
Share Now
Advertisement