Krishna Express Cancelled: నేడు, రేపు కృష్ణా ఎక్స్‌ ప్రెస్‌ రద్దు.. రైల్వే అధికారుల ప్రకటన.. మరో మూడు ప్యాసింజర్ రైళ్ల రద్దు 15 వరకూ పొడిగింపు

ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి నగదు తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు.

Trainman App New Feature

Hyderabad, Oct 10: నేడు, రేపు కృష్ణా ఎక్స్‌ ప్రెస్‌ (Krishna Express) సర్వీసును అధికారులు రద్దు (Cancelled) చేశారు. ఇప్పటికే టిక్కెట్లు బుక్ (Tickets Booking) చేసుకున్న వారికి నగదు తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు. అదిలాబాద్-తిరుపతి మధ్య నడిచే ఈ రైలు రద్దు కావడం గత రెండువారాల్లో ఇది రెండోసారి.  మరోవైపు, కాజీపేట-డోర్నకల్ మద్య నడిచే డోర్నకల్ ప్యాసింజర్, సికింద్రాబాద్-వరంగల్ మధ్య నడిచే పుష్‌‌ పుల్, కాజీపేట-బల్లార్షా మద్య నడిచే బల్లార్షా ఎక్స్‌ప్రెస్ రైళ్ల రద్దును ఈ నెల 15 వరకూ పొడిగిస్తున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.

Elections in TS: నవంబర్‌ లో తెలంగాణ ఎన్నికలు.. గ్రూప్స్, ఉపాధ్యాయ ఉద్యోగార్థుల్లో ‘వాయిదా’ టెన్షన్.. నవంబర్ 30న తెలంగాణలో పోలింగ్.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ, గ్రూప్-4 ఫలితాల విడుదలపై సందేహాలు

రద్దు ఎందుకంటే??

సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఇంటర్‌లాకింగ్ పనుల కారణంగా రైలు సర్వీసులను రద్దు చేసినట్టు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Viral Video: ఇదేందయ్యా ఇది.. మేమెప్పుడూ చూడలే.. పాకిస్థాన్‌ వీధుల్లో ట్రంప్‌ కుల్ఫీ అమ్మడమేంటి? అసలేంటి సంగతి?? (వీడియో)