Representative Image (Photo Credit: PTI)

Hyderabad, Oct 10: తెలంగాణలో (Telangana) ఎన్నికల షెడ్యూల్ (Election Schedule) విడుదలైన నేపథ్యంలో గ్రూప్స్ (Group Exams), ఉపాధ్యాయ ఉద్యోగార్థుల్లో ‘వాయిదా’ టెన్షన్ మొదలైంది. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయా లేదా అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ఉపాధ్యాయ పరీక్షల నోటిఫికేషన్ ప్రకారం, నవంబర్ 20-23 మధ్య స్కూల్ అసిస్టెంట్స్, పండిట్ పోస్టులు, నవంబర్ 24-30 మధ్య ఎస్జీటీ పోస్టులకు పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే, నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. దీంతో, మొత్తం ఉపాధ్యాయ పరీక్షలు వాయిదా వేస్తారా? ఆ రోజు జరగాల్సినవి మాత్రమే వాయిదా వేస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ దూకుడు.. నవంబర్‌ 9న గజ్వేల్‌, కామారెడ్డిలో నామినేషన్‌.. 15న బీఆర్‌ఎస్‌ మ్యానిఫెస్టో.. 16 నుంచి సీఎం కేసీఆర్‌ వరుసగా జిల్లాల పర్యటనలు

గ్రూప్స్ విషయంలో కూడా సందేహాలు

గ్రూప్స్ విషయంలో కూడా ఇదే తరహా సందేహాలు వినిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం గ్రూప్-2 నవంబర్ 2,3 తేదీల్లో జరగాలి. కానీ నవంబర్ 3 నుంచి ఎన్నికల నామినేషన్లు స్వీకరిస్తారు. దీంతో, ఉన్నతాధికారులందరూ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించాల్సి వస్తుందని, ఫలితంగా పరీక్షల నిర్వహణ సాధ్యపడకపోవచ్చని అంటున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో గ్రూప్-4 ఫలితాలు వెల్లడిస్తారా లేదా అన్న విషయంలో కూడా సందేహాలు నెలకొన్నాయి.

Viral Video: ఇదేందయ్యా ఇది.. మేమెప్పుడూ చూడలే.. పాకిస్థాన్‌ వీధుల్లో ట్రంప్‌ కుల్ఫీ అమ్మడమేంటి? అసలేంటి సంగతి?? (వీడియో)