IPL Auction 2025 Live

Google Drive: ఆగస్ట్ నుండి విండోస్ 8 ఓఎస్ వెర్షన్స్‌ కు గూగుల్ డ్రైవ్ సేవలు నిలిపివేత.. గూగుల్ కీలక నిర్ణయం.. సైబర్ దాడులు, యూజర్ డేటా భద్రత కోసమేనట

ఆగస్ట్ 2023 నుండి విండోస్ (32 బిట్ వర్షన్) ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగిస్తున్న యూజర్లకు గూగుల్ డ్రైవ్ సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది.

Google (Photo Credits: Pixabay)

Hyderabad, June 10: గూగుల్ (Google) సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్ట్ 2023 నుండి విండోస్ (Windows) (32 బిట్ వర్షన్) ఆపరేటింగ్ సిస్టమ్ (Operating System) ఉపయోగిస్తున్న యూజర్లకు గూగుల్ డ్రైవ్ (Google Drive) సేవలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా విండోస్ 8, విండోస్ 8.1, విండోస్ సర్వర్ 2012 యూజర్లకు ఇకపై గూగుల్ డ్రైవ్ సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. సైబర్ దాడులు, యూజర్ డేటా భద్రత వంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Monsoon to AP: మరో మూడునాలుగు రోజుల్లో ఏపీకి రుతుపవనాలు.. ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం.. తెలంగాణలో నిప్పులు కురిపిస్తున్న భానుడు

అప్ గ్రేడ్ కు సూచన

ప్రస్తుతం విండోస్ 8 ఓఎస్ ఉపయోగిస్తున్న యూజర్లు తమ కంప్యూటర్లలో ఓఎస్ ను విండోస్ 10కు అప్ గ్రేడ్ చేసుకోవాలని గూగుల్ సూచించింది. కాగా, గూగుల్ బ్రౌజర్ ద్వారా యూజర్లు డ్రైవ్ ను యాక్సెస్ చేసుకోవచ్చునని వెల్లడించింది.

Disney Hot star: జియో దెబ్బకు దిగొచ్చిన హాట్‌స్టార్‌, క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఇక పండుగే, భారత్‌లో జరిగే అన్ని క్రికెట్‌ మ్యాచ్‌లు ఫ్రీగా లైవ్‌ చూడొచ్చని హాట్‌స్టార్ ప్రకటన