New Delhi Railway Station Stampede(X)

Delhi, Feb 16:  న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట(New Delhi Railway Station Stampede) దుర్ఘటన దురదృష్టకరం అన్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud). తొక్కిసలాట ఘటనలో 18 మంది మరణించడం మనసును కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తొక్కిసలాటలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని...బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా(Ex-Gratia ) ప్రకటించింది కేంద్రం. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. తీవ్ర గాయాలైన వారికి రూ.2.5 లక్షల చొప్పున పరిహారం అందించగా స్వల్ప గాయాలైన వారికి రూ.లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించనున్నారు.

అరసవల్లి ఆలయం వివాదంపై సింగర్ మంగ్లీ లేఖ..దేవుడి కార్యక్రమానికి రాజకీయ ముద్ర వేస్తారా? అంటూ ప్రశ్న 

ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 18కి చేరింది మృతుల సంఖ్య.మరో 30 మందికి గాయాలు కాగా తొక్కిసలాట ఘటనపై విచారణకు ఆదేశించింది రైల్వే శాఖ. నిన్న రాత్రి 9.30 గంటల సమయంలో 14, 15 ప్లాట్ ఫామ్ లపై ఈ దుర్ఘటన జరిగింది.

కుంభమేళాకు వెళ్లాల్సిన స్వతంత్ర సేనాని ఎక్స్‌ప్రెస్‌, భువనేశ్వర్‌ రాజధాని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాగ్‌రాజ్‌కు మరో ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ రైలును అందుకునే క్రమంలో ఒక్కసారిగా ప్లాట్ ఫామ్ పైకి వచ్చారు ప్రయాణికులు. సుమారు 15 నుంచి 20 నిమిషాలపాటు తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.