TTD Seva Tickets: సెప్టెంబరు నెలకు సంబంధించి సేవా టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్న టీటీడీ.. ఈ నెల 19న శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల.. జూన్ 21 వరకు లక్కీడిప్ కు అవకాశం.. మరిన్ని వివరాలు ఇవే..

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సెప్టెంబరు నెల శ్రీవారి సేవలకు సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. ఈ నెల 19న తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ లో ఉంచనుంది.

Credits: Twitter/TTD

Tirupati, June 17: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ-TTD) సెప్టెంబరు నెల శ్రీవారి సేవలకు (Srivari Seva) సంబంధించిన టికెట్లను (Tickets) ఆన్ లైన్ (Online)లో విడుదల చేయనుంది. ఈ నెల 19న తిరుమల (Tirumala) శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్ లైన్ లో ఉంచనుంది. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టాదళ పాదపద్మారాధన, ఆర్జిత సేవల్లో పాల్గొనేందుకు ఈ నెల 19 నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు టికెట్లు అందుబాటులో ఉంటాయి. అదే సమయంలో భక్తులు లక్కీడిప్ కోసం తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు.

Accident in Konaseema: కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యాను-కారు ఢీ.. నలుగురి దుర్మరణం.. మరో 9 మందికి గాయాలు

కల్యాణోత్సవం సేవల కోసం..

ఈ నెల 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లను ఆన్ లైన్ లో ఉంచనున్నారు. అదే రోజున ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను కూడా విడుదల చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, శ్రీవారి దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. అదే రోజున (జూన్ 22) ఉదయం 10 గంటలకు పవిత్రోత్సవాల టికెట్లను కూడా ఆన్ లైన్ లో ఉంచనున్నారు. ఈ నెల 23 ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.

Rupee Biryani Offer: రూపాయ్‌ నోటుకు బిర్యానీ ఆఫర్‌.. ఎండను సైతం లెక్క చేయకుండా జనాలు బారులు.. బయటకు వచ్చి చూస్తే జరిమానా.. అసలేంటి విషయం..

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement