Road Accident (Representational Image)

Vijayawada, June 17: కోనసీమ (Konaseema) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే, అనకాపల్లి (Anakapalle) సమీపంలోని చోడవరానికి చెందిన 9 మంది టాటా మ్యాజిక్ వాహనంలో కొత్తపేట మండలం మందపల్లికి దైవదర్శనం కోసం వెళ్తున్నారు. ఆలమూరు మండల పరిధిలోని మడికి జాతీయ రహదారిపై విశాఖ వైపు నుంచి వస్తున్న కారు అదుపు తప్పి ఈ వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది.

Rupee Biryani Offer: రూపాయ్‌ నోటుకు బిర్యానీ ఆఫర్‌.. ఎండను సైతం లెక్క చేయకుండా జనాలు బారులు.. బయటకు వచ్చి చూస్తే జరిమానా.. అసలేంటి విషయం..

Jagananna Ammavodi: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం, ఈ నెల 28న విద్యార్ధులకు జగనన్న అమ్మ ఒడి, ఇది లేకపోతే అమ్మ ఒడి డబ్బులు పడవు

కారులో ఒకరు.. వ్యాన్‌లో ముగ్గురు

ఈ ఘటనలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు, కారులోని ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 9 మంది గాయపడగా వారిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Jogu Ramanna: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఆత్మహత్య చేసుకుంటా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న.. కాంగ్రెస్ ఓడిపోతే, రేవంత్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవాలని ఎమ్మెల్యే సవాల్