Coronavirus Suspects Escape: పరారైన కరోనా అనుమానితులు, నాగపూర్‌లోని మయో జనరల్ హాస్పిటల్‌లో ఘటన, మార్చి 30 వరకు ధియేటర్లు బంద్, పలు ఆంక్షలను విధించిన ఉద్ధవ్ సర్కారు

కరోనాను నియంత్రించటానికి ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఏదో ఒక మూల కొత్త కేసు నమోదు కావడంతో అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని నాగ్‌పూర్ హాస్పిటల్ నుంచి నలుగురు కరోనా అనుమానితులు (Coronavirus Suspects Escape) పరారయ్యారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారిని కరోనా సోకి ఉంటే పరిస్థితి ఏమవుతోందనని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

Coronavirus Outbreak in India (Photo Credits: IANS)

Nagpur, Mar 14: మహారాష్ట్రలో కరోనా (Coronavirus in Maharashtra) మెల్లిగా విస్తరించుకుంటూ వస్తోంది. మహారాష్ట్రలో ఇప్పటికే 18కిపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్ర సర్కారు అలర్ట్ అయింది. కరోనా భయంతో ఇప్పటికే మహారాష్ట్రలోని ముంబై, ధానే,నవీ ముంబై, నాగ్ పూర్, వంటి ప్రాంతాల్లో మార్చి 13,2020 అర్థరాత్రి నుంచీ మార్చి 30 వరకూ సినిమా థియేటర్లు, ఆడిటోరియాలు, జిమ్ లు, స్మిమ్మింగ్ పూల్స్ మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ( MAHA Govt) ఆదేశాలు జారీచేసింది.

అక్కడ కరోనా సామూహిక సమాధులు

ఇదిలా ఉంటే కరోనాను నియంత్రించటానికి ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ ఏదో ఒక మూల కొత్త కేసు నమోదు కావడంతో అధికారులు సైతం తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని నాగ్‌పూర్ హాస్పిటల్ నుంచి నలుగురు కరోనా అనుమానితులు (Coronavirus Suspects Escape) పరారయ్యారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారిని కరోనా సోకి ఉంటే పరిస్థితి ఏమవుతోందనని అధికారులు ఆందోళన చెందుతున్నారు.

కేరళను వణికిస్తున్న అంతుచిక్కని వ్యాధులు

కరోనా సోకినట్లుగా అనుమానిస్తున్న ఐదుగురు వ్యక్తులు మయో జనరల్ హాస్పిటల్ ఐసోలేషన్ వార్డు (Mayo General Hospital Isolation ward) నుంచి తప్పించుకున్నారని నాగ్ పూర్ సబ్ ఇన్ స్పెక్టర్ ఎస్.సూర్యవంశీ తెలిపారు. మార్చి 6న యునైటెడ్ స్టేట్స్ నుంచి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా సోకింది. కాగా అదే మహారాష్ట్రలో మొదటి కరోనా కేసుగా నమోదైంది.

ఇన్ఫోసిస్‌కు కరోనా ఎఫెక్ట్

ఆ తరువాత మరో 10మందికి కరోనా సోకినట్లుగా అనుమానిత కేసులు నమోదయ్యాయి.ఈ క్రమంలో నాగ్ పూర్ లో ఇద్దరు, ముంబై, పూణే, అహ్మద్ నగ్ లలో ఒక్కొక్కరు అనుమానితులగా నమోదవ్వగా ఇప్పటికే మొత్తం 18కి పైగానే ఈ సంఖ్య చేరుకుంది.

దేశంలో ఇప్పటికీ 83 కేసులు నమోదు, మహారాష్ట్రలో 19కి చేరిన కరోనా కేసులు

ఈ నేపథ్యంలో 1897 లోని అంటు వ్యాధుల చట్టంలోని నిబంధనల ప్రకారం ఈ ఆంక్షలను ప్రభుత్వం విధించింది. కరోనా కేసులు పుణేలో ఎక్కువ నమోదు కావడంతో ఆ ప్రాంతంలో అన్ని ప్రభుత్వ స్కూళ్లను మూసివేయాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఆదేశించారు. కాగా 10th క్లాస్ ఇంటర్ లకు ఎగ్జామ్స్ జరుగుతున్నందున వారికి సెలవులు ప్రకటించడం కుదరలేదు.

రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని స్కూళ్లను మూసివేయటం అనేది కరోనా వైరస్ పరిస్థితిని బట్టి ఉంటుందని ఆయా పరిస్థితుల దృష్ట్యా నిర్ణయం తీసుకంటామని సీఎం తెలిపారు. మత, సాంస్కృతిక, వాణిజ్య మరియు క్రీడా కార్యక్రమాలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని నిర్వాహకులను మరియు ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థలను అడుగుతుందని థాకరే చెప్పారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement