Coronavirus Mass Graves: అక్కడ కరోనా సామూహిక సమాధులు, కరోనా మృతులను సామూహిక ఖననం చేస్తున్న ఇరాన్, ఒక్కో సమాధి 100 గజాల పొడవు
coronavirus Mass Graves Satellite images show Iran's mass graves for coronavirus victims (Photo-Twitter)

Tehran, Mar 14: కరోనా వైరస్ (Coronavirus) ఉగ్రరూపం దాల్చింది. మొత్తం ప్రపంచాన్ని ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలోని (China) వూహాన్ లో వెలుగు చూసిన ఈ వైరస్‌ వ్యాప్తి ప్రస్తుతం అక్కడ కొంత తగ్గుముఖం పట్టగా.. ఇతర దేశాల్లో మాత్రం తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఏ దేశాన్ని వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా చైనాకు వెలుపల ఇరాన్‌లో (Iran) ఎక్కువగా ప్రభావం చూపుతోంది.

కేరళను వణికిస్తున్న అంతుచిక్కని వ్యాధులు

ఇరాన్‌ దేశం అయితే కోవిడ్ 19 (COVID -19) దెబ్బకు విలవిలలాడిపోతోంది. ఇరాన్‌ ప్రభుత్వం అధికారికంగా 429 మంది మాత్రమే తమ దేశంలో చనిపోయారని చెబుతున్నా పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. దేశంలో ఇప్పటికే 10, 075 మంది ఈ వైరస్ బారిన పడ్డారు.

ఈ నేపథ్యంలో అక్కడ కరోనాతో చనిపోయిన వారిని స్పెషల్ కేసుల కింద పరిగణిస్తున్నారు. వారి కోసం దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో సామూహిక సమాధులు (coronavirus Mass Graves) తవ్వుతున్నారు.

Here's Tweet

ఇరాన్ రాజధాని టెహరాన్‌కు (Tehran) 145 కి.మీ. దూరంలోని కోమ్ సిటీ వద్ద కరోనా సమాధులు తవ్వుతున్నారు. కరోనా మృతులను విడివిడిగా కాకుండా సామూహికంగా అక్కడ ఖననం చేశారు. ఒక్కో సమాధి 100 గజాల పొడవు ఉంది. ఈ సమాధులు అంతరిక్షం నుంచి చూసినా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఇన్ఫోసిస్‌కు కరోనా ఎఫెక్ట్

కాగా ఇందుకు సంబంధించిన కొన్ని శాటిలైట్ చిత్రాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో పాత సమాధులను పూడ్చి కొత్తగా తవ్వుతున్నట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇరాన్‌లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి ఆ దేశం ప్రపంచ బ్యాంకును భారీ సాయం కోరుతోంది.

కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ఇరాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న 24 గంటల్లో సైనిక దళాలు ఇరాన్‌ వీధులన్నింటినీ స్వాధీనం చేసుకుంటాయని, ఆ తరువాత ప్రతీ పౌరుడికి కరోనా నిర్ధారణ పరీక్షలు జరుపుతామని ప్రభుత్వం ప్రకటించింది.

దేశంలో ఇప్పటికీ 83 కేసులు నమోదు, మహారాష్ట్రలో 19కి చేరిన కరోనా కేసులు

కరోనాపై యుద్ధంలో సైనిక దళాలు ప్రధాన పాత్ర పోషించాలని సుప్రీం లీడర్‌ అయతొల్లా ఖమేనీ ఆదేశించారు. ఇప్పటికే శుక్రవారం సామూహిక ప్రార్థనలను ఇరాన్‌ రద్దు చేసింది. పాఠశాలలను మూసివేసింది. ఈ వైరస్‌ కారణంగా ఇరాన్‌లో గురువారం ఒక్కరోజే 85 మంది మృత్యువాత పడ్డారు.

ఇటలీలో మృతుల సంఖ్య 1000 దాటింది. మొత్తం 15 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇటలీలోని లాంబర్డీ ప్రాంతంలో ఈ వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉంది. ఫ్రాన్స్, స్పెయిన్, జర్మనీల్లో కేసుల సంఖ్య 2 వేల చొప్పున నమోదయ్యాయి. ఫ్రాన్స్, ఐర్లాండ్, డెన్మార్క్, నార్వే, లిథువేనియా, అల్జీరియా, స్లొవేకియాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

ప్రజలు విందు, వినోదాల కు దూరంగా, ఇంట్లోనే ఉంటున్నారు. బృంద కార్య క్రమాలపై అప్రకటిత నిషేధం అమలవుతోంది. అమెరికాలో కేసుల సంఖ్య 16 వందలకు చేరింది. మరోవైపు, నేపాల్‌ ఎవరెస్ట్‌ సహా అన్ని పర్వతారోహణ కార్యక్రమాలపై నిషేధం విధించింది.

ఈ కోవిడ్‌–19 వల్ల ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 5 వేలు దాటింది. కేసుల సంఖ్య 1.34 లక్షలకు చేరింది. మృతుల సంఖ్య చైనాలోనే అత్యధికం. అక్కడ 3,176 మంది చనిపోయారు.