People wearing masks in Maharashtra due to coronavirus fears (Photo Credits: IANS)

Mumbai/Bengaluru, March 14: కరోనా వైరస్ (Coronavirus) ప్రపంచదేశాలను వణికిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన రిపోర్ట్ ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 5,417కు చేరింది. లక్షా 45 వేల 413 మంది కరోనా బాధితులు ఉన్నారు. 6 వేల 116 మందికి సీరియస్ గా ఉంది. కరోనా వైరస్ 139 దేశాలకు పాకింది.

మన  దేశంలో 83 మందికి కరోనా వైరస్ సోకడంతోపాటు ఈ వైరస్ ప్రభావంతో ఇద్దరు మరణించారు. మహారాష్ట్రలో ఇప్పటికే 19 కేసులు నమోదయ్యాయి.

గూగుల్ కార్యాలయంలో పనిచేసే ఒక ఉద్యోగికి కోవిడ్-19 పాజిటివ్‌

ఇక ఇటలీలో కరోనా మృత్యుఘోష ఆగడం లేదు..అంతకంతకూ పెరిగిపోతోన్న కేసులతో అల్లాడిపోతోంది. ఒక్కరోజే 189 మంది చనిపోయారు. ఇండియాలో దీని భారీన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. పలు కార్యక్రమాలను రద్దు చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) వార్షిక సమావేశాలపై కరోనా (COVID-19) ప్రభావం పడింది. బెంగళూరులో తలపెట్టిన అఖిల్‌ భారతీయ ప్రతినిధి సభ సమావేశాలను రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) రద్దు చేసింది. ఈ నెల 15 నుంచి 17 వరకు బెంగళూరులో ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాల నిర్వహణ తలపెట్టింది.

కాగా కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో పబ్లిక్‌ మీటింగ్‌లపై కర్ణాటక ప్రభుత్వం (Karnataka Govt) నిషేదాజ్ఞలు విధించింది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బెంగళూరులో రేపు ప్రారంభం కానున్న ఆర్‌ఎస్‌ఎస్‌ సమావేశాలను రద్దు చేస్తున్నట్లు సంఘ్‌ ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి తెలిపారు.

గతంలో ఎమర్జెన్సీ, మహాత్మాగాంధీ (Gandhi) హత్య జరిగిన సమయాల్లో రెండు సార్లు మాత్రమే ఆర్ఎస్ఎస్ వార్షిక సమావేశాలను రద్దు చేశారు.